స్టార్ కమిడియన్, పెద్ద నిర్మాతలపై ఐటీ దాడులు

చెన్నైలో 23 చోట్ల, రాష్ట్ర వ్యాప్తంగా 6 చోట్ల తనిఖీలు నిర్వహించిన అధికారులు.. పలు కీలక దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్టార్ హీరో సూర్య సమీప బంధువు, నిర్మాత అయిన జ్ఞానవేల్ రాజాకు చెందిన స్టూడియో గ్రీన్ సంస్థల్లో ఆకస్మిక దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు.. ఆయనకు చెందిన చెన్నై, మదురైలోని సంస్థలు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. అలాగే హాస్యనటుడు సంతానం, నిర్మాతలు ఆర్‌బీ చౌదరి, ఏఎం రత్నం, అశోక్ సామ్రాట్ తదితరుల నివాసాల్లోనూ ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
అదే విధంగా హైదరాబాద్‌లోని ఏఎం రత్నం నివాసంలోనూ తనిఖీ చేసినట్లు సమాచారం. ఒక్కసారిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇంత మంది నివాసాలపై తనిఖీలు చేపట్టడంతో కోలీవుడ్ దిగ్భ్రాంతి చెందింది. కాగా, తనిఖీల్లో పలు కీలక రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల సందర్భంగా ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ... పలు ప్రైవేట్ సంస్థలు లెక్కకు రాని నల్ల ధనాన్ని సినీ నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా తమకు సమాచారం అందిందని, అందుకే తామీ తనిఖీలు చేపట్టామని తెలిపారు.


Click it and Unblock the Notifications











