ఆ హీరో ఇంటిపై ఐటి అధికారుల దాడి
సినిమా హీరో హీరోయిన్లు ఇన్ కం టాక్స్ ఎగ్గొట్టడం కొత్తేం కాదు. తమిళ హీరో అజిత్ టాక్స్ ఎగ్గొట్టాడోలేదో కానీ ఆయన ఇంటిమీద మాత్రం ఇన్ కం టాక్స్ అధికారులు దాడి జరిపారు. అజిత్ హీరోగా నటించిన బిల్లా సినిమా విడుదలైన కొద్దిరోజులకే అధికారులు ఈ దాడి జరపడం విశేషం కాగా వారికి కొంత డబ్బును సీజ్ చేయగలిగారు కూడా. ఎంత సీజ్ చేశారో చెప్పడానికి మాత్రం అధికారులు ముందుకు రావడం లేదు. ఒక స్టార్ సినిమా విడుదలైన తరువాత ఇలా దాడి జరపడం తమకు కొత్తే కాదని అధికారులు అంటున్నారు. మరో విశేషం ఏమంటే తన ఇంటిపై దాడి జరిగిన వెంటనే అజిత్ గైండీలోని ఒక స్టార్ కు తన మకాం మార్చాడు. రెండురోజులుగా బయటకు రాకుండా ఆ హోటల్ లోనే గడుపుతున్నాడు.
తమిళ సినీ హీరోలలో ఒక్క రజనీకాంతే గత 15 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఇన్ కం టాక్స్ కట్టి ఉత్తమ టాక్స్ పేయర్ అవార్డును కూడా పొందాడు. అయినా కూడా చెన్నయ్ ఇన్ కం టాక్స్ అధికారులు రజనీకాంత్ సినిమా చంద్రముఖి విడుదలైన వెంటనే ఆయన ఇంటిపై దాడి జరిపిన ఘటన ఉంది. మరో హీరో విజయ్ నటించిన పోకిరి సినిమా విడుదలైన వెంటనే ఆయన ఇంటిపై కూడా దాడి జరిపారు.


Click it and Unblock the Notifications











