Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సినీ ఇండస్ట్రీపై ఐటీ అధికారుల నిఘా.. విజయ్ ఇంటిపై ఐటీ రైడ్స్
సినీనటుల ఇళ్లపై ఐటీ శాఖ అధికారులు దాడి చేయడం ఈ మధ్య సర్వసాధారణం అయింది. వరుసగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పాపులర్ నటులపై ఐటీ దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంటిపై ఐటీ దాడి జరిగింది. వివరాల్లోకి పోతే..

మొన్నామధ్య నాగార్జున, నాని, వెంకటేష్ లాంటి బడా హీరోల ఇళ్లపై
ఐటీ దాడులు చేసిన ఆఫీసర్స్.. ఇటీవలే లావణ్య త్రిపాఠి, అనసూయ, సుమ ఇళ్లపై కూడా ఐటీ రైడ్స్ చేశారు. అలాగే క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై కూడా ఐటీ ఆఫీసర్స్ దాడులు చేయడం హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు వారి కన్ను విజయ్ ఇంటిపై పడింది.

విజయ్‌తో పాటు ఆ కార్యాలయంలోనూ
విజయ్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ సినిమాస్, ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వారి వారి ఆదాయాల తాలూకు వివరాలు రాబడుతున్నారు.

బిగిల్ మూవీ.. ఆదాయపు పన్ను లెక్కలు
విజయ్ హీరోగా ఏజీఎస్ సినిమాస్ బ్యానర్ పై రూపొందిన బిగిల్ మూవీ 120 రూపాయల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు సరిగ్గా ఆదాయపు పన్ను లెక్కలు చూపనందున ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ మేరకు విజయ్ ని ప్రశ్నిస్తున్నారు అధికారులు.

మాస్టర్ మూవీ సెట్స్‌పై విజయ్.. ఎంటరైన ఐటీ శాఖ
తమిళనాడులోని మధురైలో అన్బు చెలియన్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిపై దాడులు నిర్వహించారు ఐటీ అధికారులు. విస్తృతంగా సోదాలను నిర్వహిస్తున్నారు. కాగా- ప్రస్తుతం విజయ్ తన తదుపరి సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తోన్న మాస్టర్ మూవీ సెట్స్‌పై ఉంది. ఈ సినిమా షూటింగ్ కడలూర్ జిల్లాలోని నైవేలీలో కొనసాగుతోంది. ఆదాయపు పన్ను అధికారులు నైవేలికి వెళ్లి విజయ్‌ని ప్రశ్నిస్తున్నారు.

ఐటీ అధికారుల నిఘా.. ఇండస్ట్రీలో కలకలం
రష్మిక మందన్న ఇంటిపై ఐటీ దాడులు జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే.. తమిళ మాస్ హీరో విజయ్‌పై ఐటీ అధికారులు నిఘా ఉంచడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం పుట్టించింది. షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మరీ ఆయనను ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది.