twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా చేస్తే ప్రభుదేవాకు అవమానమే : ధనుష్

    By Bojja Kumar
    |

    ముంబై : కొలవెరి పాటతో ఇండియా మొత్తం గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం 'రంఝానా' అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్.

    ఇప్పటికే సౌతిండియా నుంచి వచ్చిన ప్రభుదేవా బాలీవుడ్లో బలంగా పాతుకుపోయాడు. డాన్సర్‌గా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ధనుష్ కూడా ప్రభుదేవా మాదిరి డాన్సులు ఇరగదీస్తాడని అనుకున్నారు బాలీవుడ్ జనాలు. అయితే ప్రభుదేవాతో పోలిస్తే ధనుష్ డాన్స్ పెర్ఫార్మెన్స్ పూర్‌గా ఉందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

    ఈ నేపథ్యంలో ధనుష్ స్పందిస్తూ...'ప్రభుదేవాతో పోలిస్తే నేను చాలా పూర్ డాన్సర్నే, ప్రభుదేవా లాంటి వారితో నన్ను పోల్చడం సరికాదు. అలా పోల్చడం ప్రభుదేవాను అవమానించడమే. దయచేసి ఆయన్ను అవమానించవద్దు' అని వ్యాఖ్యానించాడు.

     అలా చేస్తే ప్రభుదేవాకు అవమానమే : ధనుష్

    నేను డాన్స్ చేసేప్పుడు ఎనర్జీతో చేస్తాను. అంత మాత్రాన నన్ను గొప్పడాన్సర్ అనుకోవడం సరికాదు అన్నారు.

     అలా చేస్తే ప్రభుదేవాకు అవమానమే : ధనుష్

    ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ ప్రాజెక్టులను ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్న ప్రశ్నకు ధనుష్ స్పందిస్తూ...అందులో పెద్ద కష్టమేమీ లేదు. ప్రస్తుతం నేను రంఘానా సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అన్నారు.

     అలా చేస్తే ప్రభుదేవాకు అవమానమే : ధనుష్

    రంఝానా చిత్రం విడుదల తర్వాత బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను ఇస్తే...ఒక తమిళ సినిమా, ఒక హిందీ సినిమా చేస్తూ ముందుకు సాగుతాను అన్నారు.

     అలా చేస్తే ప్రభుదేవాకు అవమానమే : ధనుష్

    ఇటీవల విజయ్ టీవీ అవార్డుల్లో తన 3 సినిమాలో నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాడు ధనుష్

     అలా చేస్తే ప్రభుదేవాకు అవమానమే : ధనుష్

    ఇక రంఝానా సినిమా కోసం హిందీ నేర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాడట ఈ బక్కపలుచని హీరో

    English summary
    During the conference of the film, the actor looked all in his cheerful mood. On public demand he even showed his dance moves but feels he is a poor dancer. "That's ridiculous. Whatever movements I learnt, it took me a lot of time to learn. I am a very poor dancer," said the actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X