హీరో గారికి కొడుకు పుట్టాడు
చెన్నై : 'జయం' చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన నటుడు జయంరవి. ప్రస్తుతం 'భూలోగం', 'తని ఒరువన్', 'రోమియో జూలియన్' చిత్రాల్లో నటిస్తున్నారు. కొన్నేళ్లక్రితం నటి ఆర్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. తొలుత ఓ మగబిడ్డకు తండ్రి అయిన.. తాజాగా మరోసారి పుత్రోత్సాహంతో పులకిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆర్తికి ప్రసవం జరిగిందని, ఆమెతోపాటు బాబు కూడా క్షేమంగా ఉన్నారు. ఈ ఆనందంలో జయం రవి మునిగితేలుతున్నారు.
మరో ప్రక్క నటి వూర్వశికి 43ఏళ్ల వయసులో కుమారుడు జన్మించాడు. నటుడు మనోజ్ కె.జైన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారామె. వారికి 14ఏళ్ల కుమార్తె జ్యోతిలక్ష్మి కూడా ఉంది. కొన్నేళ్ల తర్వాత అభిప్రాయభేదాలతో విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం భవన నిర్మాణ గుత్తేదారు శివప్రసాద్‌ను ప్రేమించి గత ఏడాది పెళ్లి చేసుకుంది వూర్వశి. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది.



Click it and Unblock the Notifications











