twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ పోటీ పడ్డా...కమల్ కే దక్కింది

    By Srikanya
    |

    చెన్నై : ఓ మంచి పాత్ర ఉందంటే నటులు దాన్ని చేసి మెప్పించాలని తాపత్రయపడుతూంటారు. తాజాగా విక్రమ్,కమల్ హాసన్ విక్రమ్ ఓ పాత్ర కోసం పోటీ పడ్డారు. అయితే అది కమల్ నే వరించిందని కోలీవుడ్ సమాచారం. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, సీనియర నటి మీనా ప్రధాన పాత్రధారులుగా ఇటీవల విడుదలైన 'ద్రిష్యుం' అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. అందులో మోహన్ లాల్ పాత్ర కోసం ఈ నటులిద్దరూ పోటీ పడ్డారు.

    ప్రేమ, యాక్షన్‌ సన్నివేశాలకు తావులేని ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ ఇద్దరు పిల్లలకు అమాయక తండ్రిగా కనిపించి మెప్పించారు. ఈ పాత్రలో నటించేందుకు తమిళం నుంచి కమల్‌హాసన్‌, చియాన్‌ విక్రమ్‌ ఆసక్తి కనబర్చారని తెలిసింది. దర్శకుడు జీతుజోసఫ్‌ మాత్రం కమల్‌నే ఎంపిక చేసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. తమిళంలోనూ ఆయనే తెరకెక్కించనున్నారని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు సమాచారం.

    It's Not Vikram, But Kamal Hassan To Remake Mohanlal's Drishyam
    ఇక తమిళ వెర్షన్ లో మీనా నే హీరోయిన్ గా తీసుకోనున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మీనా దశ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది . గతంలో 'భామనే సత్యభామనే' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి మనకు తెలిసిందే. అలాంటి ఈ జంటను ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలయాళం వెర్షన్లో చక్కని అభినయాన్ని ప్రదర్శించిన మీనానే తమిళంలో కూడా తీసుకోవాలని కమల్‌ భావిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

    మలయాళ రీమేక్‌లో కమల్‌హాసన్‌ నటించనున్నారనే వార్త కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమలను సైతం ఈ చిత్ర ఫలితం ఆశ్చర్యపరచగా.. తెలుగు, తమిళం, కన్నడం తదితర భాషల్లోనూ ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. విశ్వనటుడు కమల్‌హాసన్‌తో తమిళ రీమేక్‌ తెరకెక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి.

    ఇక రీమేక్ సినిమాలను ఎన్నింటినో చేసి రీమేక్ ల ద్వారా హిట్ లు సాధించిన మన తెలుగు హీరో వెంకటేష్ మరో సారి ఈ రీమేక్ సినిమా ని ఎంచుకున్నారు. "దృశ్యం'' సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా పునర్ నిర్మించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైడ్ యాంగిల్ ఈ మూడు సంస్థలు సినిమాను తెలుగులో సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అతి త్వరలో వెల్లడించనున్నారు.

    English summary
    Mohanlal's Drishyam is Malayalam movie in the recent months that had garnered attention from other film industries. Many producers and actors from other industries have expressed their interest to remake it their respective languages. When it comes to Tamil, it was Vikram and then Kamal Hassan, who was bowled over by the content and wanted to remake it in Kollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X