తమ్ముడు గురించి కేర్ తీసుకుంటున్న అన్నయ్య...!
తమిళ నటుడు కార్తీ ఇకపై రీమేక్ సినిమాల్లో నటించరాదని నిర్ణయించుకున్నాడు. 'విక్రమార్కుడు"చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్న కార్తీ ఆ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. అయితే ఆ సినిమాని తెలుగులో విడుదల చేసే వీలు లేకపోవడంతో ఇక్కడ అతనికి గ్యాప్ వచ్చేసింది. తమిళంతో పాటుగు తెలుగులోనూ సమాంతరంగా కెరీర్ బిల్డ్ చేసుకోవాలని చూస్తున్న కార్తీకి ఇది మంచి పద్దతి కాదనిపించిది. అందుకే ఎంత మంచి చిత్రం రైట్స్ తీసుకున్నా కూడా రీమేక్ చిత్రాలకి దూరంగా ఉంటానని అంటున్నాడు.
ఈ విషయంలో అతని అన్న సూర్య సలహానే కార్తీ ఇకపై పాటించబోతున్నాడు. తెలుగు లో తమ మార్కెట్ పరిధిన పది నుంచి పదిహేను కోట్ల వరకు పెంచుకునే అవకాశం ఉండడంతో నటించిన ప్రతి సినిమా అక్కడ విడుదలయ్యేలా చూసుకుంటే, తెలుగు తమిళంలో కలిపి నలభై కోట్ల ఫైచిలుకు హీరో కావచ్చుననేది సూర్య ఐడియా అట. అందుకే ఎక్కువగా ఒరిజినల్ స్క్రిప్ట్ లనే ఫ్రిఫర్ చేసే సూర్య తమ్ముడికీ అదే పద్దతి పాటించమని చెబుతున్నాడట. దాంతో ఎవరైనా నిర్మాతలు తెలుగు సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని వెళితే కార్తీ నిర్మొహమాటంగా చేయనని చెప్పేస్తున్నాడని కోలీవుడ్ వర్గాల నుండి అందిన సమాచారం.


Click it and Unblock the Notifications











