అమ్మో...ప్రియమణి ఉంది జాగ్రత్త

ఇక ప్రస్తుతం ప్రియమణి చేస్తున్న మణిరత్నం చిత్రం అశోకవనంలో పాత్ర గురించి మాట్లాడుతూ ఇప్పటికీ ఆ పాత్ర మణిసార్ మైండ్ లో తయారువుతూనే ఉందని నా నమ్మకం. ఇక శూర్ఫణఖగా నెగిటివ్ పాత్రట కదా అంటే ...మంచి స్టప్ ఉన్న పాత్ర...అన్ని ఏంగిల్స్ ఆ పాత్రలో గమనించవచ్చు..అయినా మణిసార్ కి నన్ను ఎలా చూపెట్టాలో తెలియదా అని దాటవేసింది. అంతే విషయాన్ని మణిరత్నం వైపుకు త్రిప్పిన ఆమె తెలివికి ...
మీరు పల్లె పడుచు పాత్రలు వేయనన్నారట గా అంటే పరుత్తు వీరన్ హిట్టయ్యాక అలాంటివి దాదాపు ఇరవై దాకా ఆఫర్స్ వచ్చాయి. మరీ మూస అయిపోతుందనీ నేను ఏ సినిమానీ ఒప్పుకోలేదు.చూసేవారికీ విసుగ్గా ఉంటుంది కదా నేను ఆ పాత్రలను రిజెక్ట్ చేయటంలో తప్పేముంది చెప్పండి అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. ప్రేక్షకులే దైవం అంటూ ఇండైరక్టుగా చెప్పిన ప్రియమణి సైకాలజీ నేర్చుకోకపోయినా అందరి ఆలోచనలు చదివినట్లే చక్కగా మాట్లాడుతోంది. ఆమె దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నారంతా.


Click it and Unblock the Notifications











