twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పచ్చి అబద్దం.. జయలలిత బయోపిక్ రిలీజ్‌పై దర్శకుడు క్లారిటీ!

    |

    తమిళనాడు మాజీ సీఎం, అలనాటి అభినేత్రి జయలలిత జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తలైవి సినిమా రిలీజ్‌పై చిత్ర యూనిట్, ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ క్లారిటీ ఇచ్చారు. కంగనా రనౌత్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే పూర్తి అయి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

    J Jayalalithaa biopic Thalaivi

    అయితే తలైవి సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ అవుతున్నదనే వార్తలు తమిళ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి.
    బాలీవుడ్ సినీ విమర్శకుడు, ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ కూడా జయలలిత బయోపిక్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నదనే వార్త పచ్చి అబద్ధం. తొలుత థియేటర్లలో విడుదలైన తర్వాతే డిజిటల్ రిలీజ్ ఉంటుందని వివరించారు.

    ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కూడా స్పందిస్తూ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. అయితే ఈ సినిమాను జూన్ 26వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు. కానీ కొవిడ్ 19 కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో సినిమా రిలీజ్ కూడా నిలిపివేశారు.

    ఇక తలైవి సినిమా విషయానికి వస్తే.. ఎంజీఆర్ పాత్రలో నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నారు. అలాగే 12 ఏళ్ల తర్వాత కంగన రనౌత్ మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. గతంలో జయం రవితో కలిసి ధామ్ ధూమ్ అనే చిత్రంలో నటించారు. విష్ణు వర్ధన్, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్ ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషలో రూపొందుతున్నది.

    English summary
    J Jayalalithaa biopic Thalaivi is going to release in theatres first. Film Unit has thrashed rumours on OTT release. They have given clarity on Theatre release first and Digital release next.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X