twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ హాసన్, జాకీ ఛాన్ కాంబినేషన్ లో...

    By Srikanya
    |

    జాకీ ఛాన్ కు ఇండియాలోనూ ఓ రేంజి అబిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఆస్కార్ రవిచంద్రన్ ఆయన్ని ఇక్కడ తన సినిమాలో నటింపచేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అయితే కార్యరూపం దాల్చటం లేదు. అయితే ఈ సారి తమిళ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో ఈ కలని పండించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. '3 ఇడియట్స్‌'కు తమిళ రీమేక్‌ 'నన్బన్‌' చిత్రానికి మంచి టాక్‌ రావటంతో ప్రస్తుతం విజయానందంలో ఉన్న దర్శకుడు శంకర్‌తో రవిచంద్రన్‌ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడు.

    మూడు భాషల్లో రూపొందే ఆ చిత్రం తమిళ వెర్షన్‌కు 'తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌' అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో జాకీ ఛాన్,కత్రినా కైఫ్ లను నటింపచేసి ఆసియా మార్కెట్ నే టార్గెట్ చేయాలని ఆయన ఆలోచనగా చెప్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రం తెలుగు,తమిళం,హిందీలతో పాటు మిగతా భారతీయ భాషల్లో,ఆసియా దేశాల్లో సబ్ టైటిల్స్ తో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇంకా ఈ ప్రాజెక్టు చర్చల స్ధాయిలోనే ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే..ప్రస్తుతం కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న 'విశ్వరూపం' ఈ సంవత్సరం విడుదలైన తర్వాత ఈ త్రిభాషా చిత్రం షూటింగ్‌ ప్రారంభం కావచ్చు. ఇంతకుముందు ఆస్కార్ రవిచంద్రన్ ..కమల్ తో 'దశావతారం'నిర్మించారు.

    English summary
    Jackie Chan has been approached for a key role in Thalaivan Irukindran starring Kamal Haasan and to be produced by Aascar Ravichandran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X