విజయ్ 63లో జాయినైన ‘సాహో’ యాక్టర్
'సర్కార్ ' మూవీతో భారీ విజయం అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ తన తర్వాతి చిత్రాన్ని(విజయ్ 63) అట్లీ దర్శకత్వంలో చేస్తున్నారు. తేరీ, మెర్సల్ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న 3వ చిత్రమిది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
'విజయ్ 63'కు సంబంధించి ఓ లేటెస్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ 'ఎజిఎస్ ఎంటర్టెన్మెంట్స్' అధినేత అర్చన ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు.

జాకీష్రాఫ్ తమిళంలో చివరగా సివి కుమార్ దర్శకత్వంలో వచ్చిన మాయావనంలో నటించారు. ఈ చింత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ఆ సినిమా తర్వాత ఇన్నాళ్లకు ఆయన విజయ్ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
'విజయ్ 63'లో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా కథిర్, డేనియల్ బాలాజీ, యోగి బాబు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











