ప్రభుదేవా మూవీలో సెక్సీ లంకిణి, తమిళ తంబీల ఫైర్!
చెన్నై : ఇటీవల 'రౌడీరాథోడ్'తో సినిమాతో బాలీవుడ్లో భారీ హిట్ కొట్టిన ప్రభుదేవా తాజాగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష చేసిన పాత్రకు గానూ శృతి హాసన్ ని ఎంపిక చేసారు. ఈ చిత్రం హిందీలో 'రామయ్య వస్తావయ్యా' అనే పేరుతో రూపొందుతోంది.
శ్రీలంక సెక్సీ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఇందులో ఓ ఐటం సాంగు కోసం ఎంపిక చేసాడు ప్రభుదేవా. సినిమాలో హీరో హీరోయిన్ ఇంటికి వెళ్లేప్పుడు వచ్చే ఓ ప్రత్యేక గీతంలో ఆమె స్టెప్పులేయనుంది. అయితే లంక బ్యూటీని తీసుకోవడంపై తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో శ్రీలంక వాసులంటే విపరీతమైన ద్వేషం పెంచుకున్న తమిళ తంబీలు.....ఈ మధ్య ఐపీఎల్‌లో కూడా తమిళ క్రికెటర్లను ఆడనివ్వవద్దని ఆందోళన చేసారు. ఇవన్నీ తెలిసి, ఓ తమిళుడివై ఉండి లంకిణిని నీ సినిమాలో తీసుకుంటావా? అంటూ ప్రభుదేవాపై మండి పడుతున్నారు. ప్రభుదేవా తన నిర్ణయం మాచ్చుకోవాలని, ఆమెను తీసేయాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు:

జాక్వెలిన్ ఈ చిత్రంలో స్పెషల్ సాంగు చేస్తోంది. జాదు కి జప్పి అనే సాంగులో ఆమె కనిపించనుంది. ఈ పాటలో ప్రభుదేవా కూడా కనిపించనున్నాడు.

ప్రస్తుతం ప్రభుదేవా రామయ్యా వస్తావయ్య షూటింగులో బిజీగా గడుపుతున్నాడు, ఈ వివాదంపై ప్రభుదేవా స్పందించాల్సి ఉంది.

తమిళ సంఘాల ఆందోళన నేపథ్యంలో ప్రభుదేవా తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందంటున్నారు.

జాక్వెలిన్ పూర్తిగా శ్రీలంక కాదు. ఆమె ఫాదర్ శ్రీలంక, మదర్ మలేషియా అందు వల్ల ఆమెను కేవలం లంక భామగానే గుర్తించడం సరికాదని కొందరంటున్నారు. ప్రభుదేవా కూడా ఇదే వాదన లేవనెత్తే అవకాశం ఉంది.

జాక్వెలిన్ 2009లో అలాడిన్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మర్డర్ 2, హౌస్ ఫుల్ 2 ఆమెకు గుర్తింపు తెచ్చాయి.
ఇక సినిమా వివరాల్లోకి వెళితే...ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నిర్మాత కుమార్ తౌరాని తనయుడు గిరీష్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు ప్రభుదేవా. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ వాతావరణానికి తగిన విధంగా చిత్రంలో కొన్ని మార్పులు చేర్పులు చేసారు. జూన్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











