డైరెక్ట్ ఓటీటీకి సిద్ధమైన మరో క్రేజీ మూవీ…రిలీజ్ ఎప్పుడంటే?

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్లన్నీ మూతపడి పోవడంతో మళ్ళీ ఓటీటీలకు మహర్దశ పెట్టే రోజులు వచ్చేశాయి. నెమ్మదిగా ఒక్కటొక్కటిగా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. తాజాగా తమిళ క్రేజీ సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది. ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన జగమే తందిరం అనే సినిమాను తెలుగులో జగమే తంత్రం అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా సరే కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తోంది.

మత్తెక్కించే కళ్లతో నభ నటేష్.. అందాల ఆరబోతలో టాప్

అయితే ఈ సినిమాను కొద్ది రోజుల క్రితం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది జూన్ 11 లేదా ఆ తరువాత దీనిని విడుదల చేయాలని అనుకుంటున్నట్లు కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్నే నిజం చేస్తూ తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. జూన్ 18వ తేదీ నుంచి ఈ సినిమాను నెట్ ఫ్లెక్స్ లో విడుదల చేస్తున్నామని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Jagame Tantram to release directly on Netflix

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శశికాంత్ నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. మరోపక్క ధనుష్ కూడా వరుస హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉండడంతో ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. ధనుష్ ఈ సినిమాలో సూరాలి అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వై నాట్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ధనుష్ 40వ సినిమా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X