twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jagame Thandhiram ప్రీ రిలీజ్ బిజినెస్.. లాభం ఎంతంటే.. షాకింగ్‌గా ధనుష్ రెమ్యునరేషన్

    |

    అసురన్, కర్ణన్ లాంటి విభిన్నమైన చిత్రాల అనంతరం భారీ అంచనాలతో వస్తున్న ధనుష్ చిత్రం జగమే తాంధిరమ్. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు మూత పడటంతో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. అయితే థియేటర్లలో రిలీజ్ కాకపోయినా రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ జరగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే....

    జూన్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో

    జూన్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో

    కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో కూడా ధనుష్ హవా కొనసాగుతునే ఉంది. తన సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు. ఏప్రిల్ 9, 2021 రోజున కర్ణన్‌ మూవీని రిలీజ్ చేసిన ధనుష్ మరోసారి జూన్ 18న మరో చిత్రం జగమే తాంధిరమ్ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడు.

    రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

    రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రానున్న జగమే తాంధిరమ్ చిత్రం సామాజిక అంశాల నేపథ్యంతో తెరకెక్కింది. ఈ చిత్ర నిడివి 2 గంటల 38 నిమిషాలు. లండన్‌లోని ఓ గ్యాంగ్‌స్టర్ కథగా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మరింత అంచనాలు పెరిగాయి. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగిందనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    55 కోట్లకు నెట్‌ఫ్లిక్స్

    55 కోట్లకు నెట్‌ఫ్లిక్స్

    జగమే తాంధిరమ్ ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను రూ.55 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. ఇక శాటిలైట్ హక్కులను రూ.10 కోట్లు చెల్లించి విజయ్ టెలివిజన్ దక్కించుకొన్నది. ఇక ఆడియో రైట్స్ రూ.1 కోటి, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.6.50 కోట్ల మేరకు జరిగిందని అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ధనుష్ రెమ్యునరేషన్ ఎంతంటే..

    ధనుష్ రెమ్యునరేషన్ ఎంతంటే..

    జగమే తాంధిరమ్ చిత్రంలో నటించిన యాక్టర్లు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ల విషయానికి వస్తే... ధనుష్ రెమ్యునరేషన్ రూ.15 కోట్లు కాగా, కార్తీక్ సుబ్బరాజ్ రూ.5 కోట్లు, సంగీత దర్శకుడు సంతోష్ నారాయన్ పారితోషికం రూ.75 లక్షలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో మలయాల ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. సినిమాటోగ్రఫిని శ్రేయాస్ కృష్ణ, వివేక్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

    Recommended Video

    Actor Murali Mohan About Viceroy Hotel Incident || Filmibeat Telugu
    లాభం ఎంతంటే..

    లాభం ఎంతంటే..

    జగమే తాంధిరమ్ చిత్రం రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. మొత్తంగా ఈ చిత్రం రూ.72.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అంటే మొత్తంగా రిలీజ్‌కు ముందే రూ.7.5 కోట్ల మేర లాభం వచ్చింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు హక్కులను ఇంకా అమ్మకపోవడం గమనార్హం. ఒకవేళ తెలుగు హక్కులకు సంబంధించిన బిజినెస్ జరిగితే అదనంగా మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Jagame Thandhiram Pre release business: Dhanush's Jagame Thandhiram is getting ready for release on Netflix. This movie trailer released and goes viral and now Top trending in twitter. Jagame Thandhiram is releasing on june 18th on netflix.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X