నమిత..చూస్తే భయం

By Staff

డెబ్బైల్లో నరసింహరాజు, జయమాలిని హీరోహీరోయిన్లుగా జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన 'జగన్మోహిని' ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ టైటిల్‌, కథ తోనే మళ్లీ 'జగన్మోహిని' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ తన భారీ అందాలతో రెచ్చకొట్టిన నమిత ఈ చిత్రంలో భయపెట్టనుందని సమాచారం. నమిత..హీరోని తన అందచందాలతో ఆకట్టుకునే జగన్మోహినిగా కనపడనుంది. ఇక ఆమె వలలో పడి అన్నీ త్వజించి ఆమె నామ జపమే చేసే హీరోగా ఆనంద్ రాజా చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో రాజా అప్పటి నరసింహరాజు పోషించిన యువరాజు పాత్ర లో కనిపిస్తారు. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో కథలో యువరాజు తనను మాయచేసిన జగన్మోహిని వలలో పడిపోతాడు. ఆ అందాల భామ అంగాంగ ప్రదర్శనకు మంత్రముగ్ధుడైన హీరో.. ఆమె కొంగుపట్టుకుని తిరుగుతూంటాడు. అప్పుడు ఆమె భార్య ఎలా తన భర్తని ఆమె నుండి రక్షించుకుందనేదే ఈ కథలో ఆసక్తికర అంశం. అలాగే ఈ చిత్రంకోసం మధురై లో వేసిన సెట్స్ చూసి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అధ్బుతం అని పొగిరారు. ఆయనే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అలాగే ఈ చిత్రం కోసం అండర్ వాటల్ సన్నివేశాలను అండమాన్ లో తీసారు. గ్రాఫిక్స్ ఎక్కువ అవటం వల్లే లేటవుతోందని దర్శక,నిర్మాతలు ఓ ప్రెస్ నోట్ లో తెలిపారు. ఇక అటు తమిళం, ఇటు తెలుగు చిత్రసీమల్లో తన అందచందాలతో కుర్రకారు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తున్న నమిత.. ఈ చిత్రంలో తన అందాలను విస్తారంగానే ఆరబోసినట్టు సమాచారం. ఇక మరో కథానాయికగా మీరాచోప్రా కనిపించి అలరించనుంది.తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ జానపద చిత్రానికి నిర్మాత హెచ్.మురళి,దర్శకుడు ఎన్.కె.విశ్వనాధన్ . గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే ఈ చిత్రంలో అనేక మాయలు,మంత్రాలు కనిపిస్తాయి. అలాంటిది ఈ చిత్రం రీమేక్ లో ఎలాంటి అద్బుతాలు కనపడతాయో ఊహించుకోమంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X