అమితమైన నమిత అందాలతో...
జానపద కథాంశాలతో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను రూపొందించి "జానపద బ్రహ్మ" గా పేరొందిన విఠలాచార్య దర్శకత్వంలో వచ్చి అఖండ విజయాన్ని సాధించిన చిత్రం జగన్మోహిని. నరసింహరాజు, జయమాలిని ప్రధాన పాత్రధారులు. ఇప్పుడా చిత్రాన్ని అదే పేరుతో రాజా, నమిత, మీరాచోప్రాల కాంబినేషన్ లో యస్.కె.విశ్వనాథన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో తమిళనాడు యూనియన్ మినిష్టర్ యం.కె.అఝాగిరి చేతుల మీదుగా విడుదలైంది. "మెలోడిబ్రహ్మ" ఇళయరాజా సంగీతాన్ని అందించారు. మధురైలో జరిగిన ఈ ఆడియో ఆవిష్కరణకు వడివేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్, నమిత అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ముఖ్యంగా నమిత ఈ చిత్రం పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అరుంధతి చిత్రంతో టాప్ రేంజ్ కి చేరుకున్న అనుష్కలాగా తనూ ఈ చిత్రంతో టాప్ హీరోయిన్ అవుతానని నమ్ముతోంది. ఇలా ఈ చిత్రం కోసం బాగా కష్టపడుతున్న(తనఅందాల ఆరబోతతో) నమిత ఈ మధ్యనే జయమాలీని కలిసి సలహాలు తీసుకున్నట్టు సమాచారం. ఏదెలా వున్నా నమిత భారీ అందాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











