twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'లింగ' ఎఫెక్టు: తమిళంలోకి జగపతిబాబు చిత్రం డబ్బింగ్

    By Srikanya
    |

    చెన్నై : రజనీకాంత్ హీరోగా జగపతిబాబు నెగిటివ్ రోల్ లోకనిపించిన 'లింగ' చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ చిత్రంతో జగపతిబాబుకు మాత్రం తమిళనాట గుర్తింపు వచ్చింది. దాంతో జగపతిబాబు పాత తెలుగు చిత్రాలను డబ్బింగ్ చేసి తమిళంలోకి విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ఒకటి మొదలైంది. అదేమిటంటే...

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    జగపతిబాబు, చార్మి జంటగా తెలుగులో విడుదలైన చిత్రం 'నగరం నిద్ర పోతున్న వేళ'. రమణ ఫిలిమ్స్‌ ఈ చిత్రాన్ని 'తలైప్పు సెయిది'గా కోలీవుడ్‌కు తీసుకొస్తోంది. ప్రేమ్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యశోకృష్ణ సంగీతం సమకూర్చారు. 'లింగ' చిత్రంతో జగపతిబాబుకు తమిళ చిత్ర పరిశ్రమలో కాస్త గుర్తింపు లభించడంతో ఈ చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలోకి అనువదిస్తున్నట్లు తెలుస్తోంది.

    Jagapathi babu's Nagaram Nidrapotunna Vela dubs in Tamil

    సినిమా గురించి నిర్మాత రమణ మాట్లాడుతూ.. ''ఇది యాక్షన్‌ చిత్రం. నెంబర్‌ వన్‌ ఛానెల్‌గా మారాలనుకున్న ఓ సంస్థ అందుకు తగినట్లు కృషిచేస్తుంది. ఆ క్రమంలో ఆ ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్న చార్మికి ఓ పెన్‌డ్రైవ్‌ లభిస్తుంది. అందులోని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ పెన్‌డ్రైవ్‌ను సొంతం చేసుకోవడం కోసం ఓ ముఠా యత్నిస్తుంది. వారిని అడ్డుకునేందుకు హీరో జగపతిబాబు చేసే పోరాటమే చిత్ర కథ. జూన్‌లో తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామ'ని తెలిపారు.

    ఛార్మి జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఉత్కం ఠంగా సాగే సినిమా. ఆహుతి ప్రసాద్‌, సత్యప్రకాశ్‌, పరు చూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, శివారెడ్డి, సుప్రజ ప్రధాన పాత్రధా రులు. ఈ చిత్రానికి కథ : దీన్‌ రాజ్‌, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీ తం: యశోకృష్ణ, ఛాయా గ్రహణం: రమేశ్‌కృష్ణ, కథ: రాజీవ్‌ నాయర్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : ప్రేమ్‌రాజ్‌.

    English summary
    Jagapathi Babu, Charmi's ‘Nagaram Nidrapotunna Vela’ directed by Prem Raj is now going to Kollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X