47 ఏళ్లకు తండ్రైన జైలర్ నటుడు.. ఆయన భార్యను చూసారా? హీరోయిన్ రేంజ్

తెలుగు ప్రేక్షకులకు తమిళ ఇండస్ట్రీలోని నటీనటులను ఆదరిస్తారనే విషయం ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ దళపతి, సూర్య, విజయ్ సేతుపతి, కార్తీ, వంటి స్టార్స్ ను తెలుగు ఆడియెన్స్ ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలోని అప్డేట్స్ పైనా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా 'జైలర్' తో దుమ్ములేపగా.. ఈ చిత్రంలో తమిళ నటుడు రెడిన్ కింగ్స్లీ కామెడీ రోల్ లో నటించి మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

జైలర్ లో టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ పక్కన నటించి మెప్పించారు. ఆయన పాత్రకు కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఫిదా అయ్యారు. అయితే తమిళ నటుడు రెడిన్ కింగ్స్లీ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. ఆయన తండ్రిగా ప్రమోషన్ పొందానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన అధికారిక ఇన్ స్టా అకౌంట్ లో బిడ్డను ఎత్తుకున్న ఫొటోలను విడుదల చేశారు. దాంతో ఆయన అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఆ బెబీకి స్వాగతం పలుకుతున్నారు.

Jailer Actor Redin Kingsley become father at 47

అయితే, తమిళ నటుడు రెడిన్ కింగ్స్లీ ఈ శుభవార్తను చెప్పుకోవడంతో ఇటు తెలుగు ఆడియెన్స్ కూడా అతని శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగానే నటుడు రెడిన్ కింగ్స్లీ భార్య ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం కమెడియన్ పాత్రలు పోషిస్తున్న ఆయన భార్యను చూసిన వారందరూ షాక్ అవుతున్నాయి. హీరోయిన్ రేంజ్ లో ఉందంటూ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె లుక్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తల్లిగా ప్రమోషన్ పొందడంతోనూ ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక నటుడు రెడిన్ కింగ్స్లీ తమిళ సీరియల్ హీరోయిన్ సంగీతను పెళ్లి చేసుకున్నారు. తమిళంలో ప్రాసరమవుతున్న ఆనంద రాగం, తిరుమగల్ ఫేమ్ సంగీతతో 2023లోనే వివాహం జరిగింది. ఈమె టీవీ సిరీయల్స్ లో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. కాగా గురువారం ఏప్రిల్ 3న తనకు పండంటి ఆడబిడ్డ జన్మించిందని అభిమానులకు తెలియజేసింది. అయితే ఈ సందర్భంగానే ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె రూపసౌందర్యాన్ని పొగుడుతూ ఫొటోలను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తమిళ నటుడు రెడిన్ కింగ్స్లీ 47వ తండ్రిగా ప్రమోషన్ పొందడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా రెడిన్ అతని భార్య నటి సంగీత తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికరంగా ప్రకటించారు. కానీ బిడ్డ మొహాన్ని మాత్రం చూపించలేదు. ఇక రెడిన్ కింగ్స్లీ కెరీయర్ విషయానికి వస్తే.. డాక్టర్, బీస్ట్, జైలర్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి, తన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈయన మొదట డ్యాన్స్ మాస్టర్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. నయనతార నటించిన 'కోకిల' చిత్రంలో ఆయన నటనకు మంచి గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లు అందుకుంటున్నాడు. అంతకు ముందు కూడా పలు తమిళ చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X