Jailer 600 Crores రజనీకి, నెల్సన్‌కు నిర్మాత కళానిధి మారన్ ఇచ్చిన కార్ల ఖరీదు ఎంతో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం నాలుగో వారంలో కూడా భారీగా వసూళ్లను రాబడుతున్నది. నిర్మాత కళానిధి మారన్ నిర్మించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాను భారీ హిట్ చేసేందుకు కారణమైన రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్‌కు ఖరీదైన కార్లను నిర్మాత బహుకరించారు. ఆ కార్లు ఏ బ్రాండ్? వాటి ధర ఎంత అనే వివరాల్లోకి వెళితే..
జైలర్ మూవీ ఓ మాదిరి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకు ముందు రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆదరణ పొందలేకపోవడంతో ఈ సినిమా విజయంపై పెద్దగా అంచనాలు లేకపోయాయనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. అయితే అంచనాలను మించి కలెక్షన్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం 600 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇంకా ఈ సినిమా నిలకడగా వసూళ్లను సాధిస్తుంది. ఈ క్రమంలో నిర్మాత కళానిధి మారన్ తన ఆనందాన్ని పంచుకొంటూ.. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, రజనీకాంత్‌కు ఖరీదైనా కార్లను బహుకరించారు.
జైలర్ సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు బీఎండబ్ల్యూ ఎక్స్ 7 (BMW X7 Car) కారును బహుకరించాడు. రజనీకాంత్ ఇంటికి కళానిధి మారన్ రెండు ఖరీదైన కార్లను తీసుకెళ్లాడు. 1.95 కోట్ల విలువైన BMW i7, 1.24 కోట్ల ఖరీదైన BMW x7 కార్లను రజనీ ముందు కళానిధి మారన్ ఉంచారు. అయితే ఖరీదైన కారును కాకుండా తక్కువ విలువ ఉన్న కారును రజనీ ఎంచుకొన్నాడు.

అయితే జైలర్ తర్వాత సన్ పిక్చర్స్‌లో మరో సినిమాను చేయాలని రజనీకాంత్‌ను నిర్మాత కళానిధి మారన్ కోరినట్టు సమాచారం. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటించాలని ఆయన కోరగా.. రజనీ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు కూడా నిర్మాత కళానిధి మారన్ ఖరీదైన కారును బహుకరించాడు. నెల్సన్‌ను పిలిచి బ్రాండ్ న్యూ పోర్సే కారును బహుకరించాడు. దీని విలువ సుమారు 1.5 కోట్లకుపైగానే ఉంటుందని తెలిసింది. ఇలా కళానిధి మారన్ తన సక్సెస్‌లో భాగమైన రజనీకాంత్, నెల్సన్‌తో తన సంతోషాన్ని పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











