Vinayakan: జైలర్ విలన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అమ్మాయిలను అలా చేశాడని!
చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలతో మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు వినాయకన్. సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. ఇటీవలే వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' మూవీతో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యారు. ఈ చిత్రంతో అతడి పేరు మారుమ్రోగిపోయింది. దీంతో వినాయకన్‌కు భారీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సీనియర్ నటుడిని ఎర్నాకుళం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఎర్నాకుళంలోని నార్త్ టౌన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోన్న వినాయకన్‌ను స్థానిక పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో గొడవ పడుతున్నాడని కొందరు స్థానికులు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. వాస్తవానికి వినాయకన్‌కు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు పోలీసులతోనే గొడవకు దిగాడట. దీంతో వాళ్లు వినాయకన్‌ను అరెస్ట్ చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది.

వినాయకన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు జరిపించారు. ఆ తర్వాత ఈ సీనియర్ నటుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. 'నన్ను వీళ్లు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలీదు. నాపై ఎన్నో అభియోగాలు చేస్తున్నారు. నేను స్త్రీలోలుడను అని కూడా అంటారు. అంతెందుకు నేను అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించానని కూడా చెబుతారు. కానీ, ఇవేమీ నిజాలు కాదు. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి' అంటూ తన వాదనను వినిపించాడు.
ఇదిలా ఉండగా.. వినాయకన్ గతంలోనూ ఓ మోడల్‌తో అసభ్యంగా ప్రవర్తించి అరెస్ట్ అయినట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ, 'జైలర్' మూవీతో అతడి రేంజ్ భారీగా పెరిగిపోయింది. అప్పటి నుంచి సౌతిండియాలోని చాలా భాషల్లో అవకాశాలను అందుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు వినాయకన్ అరెస్ట్ అవడం సెన్సేషన్ అవుతోంది. ఇక, ఈ సీనియర్ నటుడు కల్యాణ్ రామ్ నటించిన 'అసాధ్యుడు' అనే మూవీతో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











