మద్యం మత్తులో జైలర్ విలన్ అర్ధ నగ్న లీలలు.. నెటిజన్ల మండిపాటు!
సినీ రంగానికి చెందిన పలువురు నటీనటుల విషయంలో వారి ఆన్ స్క్రీన్ పెర్ఫామెన్స్ లు నడవడిక ఎలా ఉన్నప్పటికీ వారికి కొంచెం ఫేమ్ ఉన్నా కూడా వారి బయట ప్రవర్తన కూడా అందరి దృష్టి ఆకర్షిస్తుంది. అయితే సినిమాల్లో ఎంత స్టార్స్, ఎలాంటి పాత్రలు చేసినప్పటికీ బయట మాత్రం తమ ప్రవర్తనలు సరిగా లేకుంటే విమర్శలు తప్పవు. మరి ఇలాంటి విమర్శలు మళ్లీ తమిళ ప్రముఖ నటుడు వినాయకన్ ఎదుర్కొంటున్నారు.
కాగా వినాయకన్ తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలుసు హీరో విశాల్ పొగరు ఇతర సినిమాల్లో తనదైన విలన్ పాత్రలు చేసి వినాయకన్ ఎప్పుడో అలరించారు. కాగా ఇటీవల అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన భారీ సినిమా జైలర్ లో సాలిడ్ విలన్ రోల్ చేసి మెప్పించి మళ్లీ సౌత్ సినిమా దగ్గర మంచి ఫేమ్ తెచ్చుకున్నారు.

కాగా ఇలా లైఫ్ లో మళ్లీ ఆఫర్ వస్తే దానిని చేజేతులా పాడుచేస్కోడానికి అతనికి మళ్లీ ఎక్కువ సమయం పట్టలేదు. ఆ సినిమా హిట్ అయ్యిన కొన్ని నెలల్లోనే అతడు ఓ కేసులో ఇరుక్కుని కాంట్రవర్సీగా మారారు. అయితే అది అయ్యింది కానీ ఇపుడు మళ్లీ వినాయకన్ వార్తల్లోక ఎక్కడం జరిగింది. అయితే ఈసారి కోసం ఓవర్ గా జరిగింది అని చెప్పాలి. తమిళనాడులో తన ఇంటి పక్క ఉన్నవారితో వినాయకన్ ఫుల్ గా తాగేసి గొడవలు పెట్టుకుంటున్న విజువల్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
ఇంటి బాల్కనీ దగ్గర అది కూడ ఒంటి మీద పెద్దగా బట్టల్లేకుండా ఇరుగుపొరుగు వారిని దుర్భాశలు ఆడుతున్న విజువల్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక లుంగీ లాంటిది ఒక్కటే కట్టుకొని దాన్ని కూా విప్పుతూ కట్టుకుంటూ వారిని తాగిన మైకంలో తిడుతున్న విజువల్స్ ఇపుడు చర్చకు దారి తీశాయి. కాగా ఈ విజువల్స్ చూసిన తమిళ నెటీజన్స్ సైతం తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అలాగే ఇలాంటి వ్యక్తికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వకూడదు అని తమిళ సినిమా ఇతన్ని బ్యాన్ చెయ్యాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి గతంలో కూడా పలు సందర్భాల్లో తనపై ఇలాంటి కాంట్రవర్సియల్ ఘటనలు ఉన్నాయి. తనని పోలస్ స్టేషన్ కి కూడా తీసుకెళ్లి క్లాస్ తీసుకున్నట్టుగా కూడా టాక్ ఉంది. అయినప్పటికీ ఈ టాలెంటెడ్ నటుడు మారకపోవడం అనేది షాకింగ్ అని చెప్పాలి.
మరి సినిమా పరంగా కూడా ఇపుడు మంచి అవకాశాలు ఉన్నప్పటికీ తన ఆఫ్ లైన్ ప్రవర్తన మూలాన తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ప్రస్తుతానికి అయితే తమిళ ఆడియెన్స్ అసహనం గానే ఉన్నారు. మరి వారు కోరుకుంటున్నటుగా తమిళ సినిమా పెద్దలు వినాయకన్ పై వేటు వేస్తారా లేదా అనేది వేచి చూడాలి మరి. కాగా ఇవి పక్కన పెడితే ఇదే జైలర్ సినిమా మేకర్స్ లేటెస్ట్ గానే పార్ట్ 2 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో కూడా వినాయకన్ ఉంటాడో లేదో అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











