Jana Nagayan Censor Report: జన నాయగన్ సెన్సార్ రిపోర్ట్.. విజయ్ మూవీపై రూమర్ల గందరగోళం

తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా రిలీజ్ అంశం మరోసారి అనేక రూమర్లకు అడ్డాగా మారింది. దక్షిణాదిలో సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తన్న చిత్రానికి సంబంధించిన సెన్సార్ రిపోర్టు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. జనవరి 9వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రాజకీయ కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడంతో ఈ సినిమా అనేక వివాదాల్లో కూరుకుపోయింది.

ఈ సినిమా రిలీజ్ కోసం నిర్మాత కేవీఎన్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. అయితే విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినా గానీ ఈ సినిమా రిలీజ్ వ్యవహారం ఎటూ తేలకపోవడం మరోసారి భారీ చర్చకు మాత్రమే కాదు.. అనేక రూమర్లు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ వ్యవహారం తాజాగా మరోసారి మీడియాలో గందరగోళాన్ని సృష్టించింది. అయితే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించిందా? లేదా అనే వివరాల్లోకి వెళితే. .

Jana Nayagan Censor Report

విజయ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జన నాయగన్ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ ఆశించారు. కానీ ఈ సినిమా రిలీజ్ వ్యవహారం ఇంకా వివాదంగానే మిగిలినట్టు కనిపిస్తున్నది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించిందనే రూమర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

అయితే జన నాయగన్ సెన్సార్ ఇంకా పూర్తి కాలేదనే విషయాన్ని సినీ వర్గాలు ధృవీకరించాయి. అయితే కొందరు లియో సెన్సార్ సర్టిఫికెట్‌కు మార్పులు, చేర్పులు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఈ సినిమా విడుదలకు సెన్సార్ క్లియరెన్స్ లభించింది అనే వార్త వైరల్ అయింది. దాంతో మీడియా ఈ విషయంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అయితే నిజంగా ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించిందా? లేదా అనేది కేవీఎన్ ప్రొడక్షన్ అధికారికంగా ప్రకటిస్తే గానీ అసలు విషయంపై క్లారిటీ లభించదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే జన నాయగన్ సినిమా రిలీజ్ డేట్‌ వ్యవహారం కూడా మీడియాలోను అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాను జూలై 24వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వ్యవహారంపై కేవీఎన్ ప్రొడక్షన్స్ మౌనంగా ఉంటున్నది. దాంతో ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందా? అని దళపతి ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్. తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.

ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.

Read more about: vijay pooja hegde jana nayagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X