Jana Nayagan: సెన్సార్ బోర్డుపై తమిళ ఇండస్ట్రీ యుద్దం.. జన నాయగన్ వివాదంపై విశాల్ వార్నింగ్
తమిళ ఇండస్ట్రీలో ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జననాయగన్. ఈ సినిమాను తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని రూపొందంచారు. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. అయితే ఈ చిత్రం వాస్తవానికి జనవరి 9వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సింది. అయితే సెన్సార్ అభ్యంతరాలు, కోర్టు కేసుల కారణంగా వివాదాల్లో చిక్కుకొని రిలీజ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది. అయితే సెన్సార్ అవలంభిస్తున్న విధానాలపై తమిళ సినిమా పరిశ్రమ యుద్ధం ప్రకటించే ప్రణాళికను సిద్దం చేస్తున్నది. ఈ విషయంపై తమిళ నడిగర సంఘం సభ్యుడు హీరో విశాల్ ఇటీవల స్పందించారు. ఆయన ఏం చెప్పారనే విషయంలోకి వెళితే..

విజయ్, హెచ్ వినోద్ కాంబినేషన్‌లో రూపొందిన జన నాయగన్ చిత్రం వాస్తవానికి సంక్రాంతి పండుగ కానుకగ జనవరి 9వ తేదీన రిలీజ్ కావాల్సింది. అయితే సెన్సార్ ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్‌కు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో చిత్ర యూనిట్ వాటికి సవరణలు చేశారు. ఆ తర్వాత సెన్సార్‌కు తమ కాపీని సమర్పించారు. అయితే రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్ది వారు స్పందించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే స్థానిక కోర్టు తేల్చాసిందేనని మద్రాస్ కోర్టును ఆదేశించింది.
అయితే కోర్టు కేసు వల్ల సినిమా రిలీజ్ ఇంకా ఆలస్యం అవుతుందని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్వాహకులు కేసును ఉపసంహరించుకొన్నారు. దాంతో ఈ సినిమా రివ్యూ చేయాల్సిందిగా రివైజింగ్ కమిటీకి సూచించారు. దాంతో ఈ సినిమా రివ్యూ వ్యవహారం ప్రస్తుతం రివైజింగ్ కమిటీ పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు తమిళనాడు ఎన్నికలు అడ్డంకిగా నిలిచాయి. ఈ క్రమంలో సెన్సార్ అవలంభిస్తున్న తీరుపై తమిళ నడిగర సంఘం ధర్నాను చేపట్టాలని నిర్ణయించింది.
తమిళనాడులోని 7 కోట్ల మంది చూసే సినిమాను కేవలం సెన్సార్ బోర్డులోని ఐదురుగు సభ్యులు డిసైడ్ చేయడం శోచనీయం. ఈ విధానానికి మేము వ్యతిరేకం. జన నాయగన్ సినిమాపై సెన్సార్ ఇదే తీరు కొనసాగితే.. 1500 మంది ఉన్న నడిగర్ సంఘం సభ్యులు ధర్నా చేస్తాం అని హీరో విశాల్ హెచ్చరించారు. అయితే జన నాయగన్ విషయంలో రాజకీయ ప్రభావం వల్ల సెన్సార్ ఆగిపోయిందనే వాదనలతో తీవ్రమైన నిరసన వ్యక్తమవుతున్నది. ఇదే క్రమంలో ది కేరళ స్టోరికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం మరింతగా చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications











