Jana Nayagan Release: దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. జన నాయగన్ రిలీజ్ అప్పుడే?
Jana Nayagan Release: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పొలిటికల్ థ్రిల్లర్ జననాయగన్ (Jana Nayagan). ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ విడుదలపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మరోసారి వాయిదా పడటం అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. తాజాగా కెనడాకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ (York Cinemas) సోషల్ మీడియా వేదికగా షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది.
ఈ సినిమాను భగవంత్ కేసరి సినిమా సోర్టీని ఆధారంగా చేసుకొని రూపొందించారట. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.

వాస్తవానికి 'జన నాయగన్'ను తొలుత 2026 జనవరి 9న పొంగల్ స్పెషల్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, సెన్సార్ అభ్యంతరాలు, కోర్టు కేసులు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా ఆ తేదీ మిస్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తోంది. అంతేకాదు, కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో సినిమాను రివైజింగ్ కమిటీకి కూడా పంపినట్లు సమాచారం. అక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తేనే కొత్త విడుదల తేదీని లాక్ చేసే అవకాశం ఉందని టాక్.
ఏప్రిల్ 30కి తరువాతే
ఈ నేపథ్యంలో కెనడాకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ (York Cinemas) సోషల్ మీడియా వేదికగా షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. యార్క్ సినిమాస్ తమ ప్రకటనలో 'ప్రియమైన ప్రేక్షకులారా, 'జన నాయగన్' సినిమా ఏప్రిల్ 30, 2026 లోపు విడుదల కాదని గమనించగలరు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు తమ రిఫండ్ కోసం సంబంధిత థియేటర్లను సంప్రదించవచ్చు' అని స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ చివర లేదా మే నెలలో వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రాలేదు.
ఈ ఆలస్యం వెనుక మరో కీలక అంశం కూడా ఉంది. విజయ్ ఇటీవల తన సొంత రాజకీయ పార్టీ తమిళగ వెట్రీ కజగం (TVK) స్థాపించారు. దీంతో 'జన నాయగన్'ను 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేస్తే ప్రచారానికి ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదలపై అడ్డంకులు వస్తున్నాయనీ, ఆలస్యానికి రాజకీయ జోక్యం కూడా ఉందని, రాజకీయ ప్రలోభాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుందనే విజయ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇలా 'జన నాయగన్'పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 30కి ముందే రిలీజ్ లేదన్నది దాదాపు ఖరారైనా, అసలు ఫైనల్ డేట్ ఎప్పుడన్నది మాత్రం మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











