Jana Nayagan Leaked: ఆన్‌లైన్‌లో జన నాయగన్ సినిమా లీక్.. విజయ్‌ని దెబ్బ కొట్టిన ప్రత్యర్థులు!
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌ను ప్రత్యర్థులు దొంగదెబ్బ గట్టిగా కొట్టారు. ఆయన నటించిన జన నాయగన్ సినిమాను పూర్తిగా ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. దాంతో ఆయన అభిమానులు, సినిమా యూనిట్, నిర్మాత తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. గత కొద్దికాలంగా సెన్సార్ చేతిలో చిక్కి విలవిలలాడుతున్న ఈ సినిమాను పైరసీ నిబంధనలకు విరుధ్దంగా చట్టవ్యతిరేకంగా లీక్ చేయడం తమిళ సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ సినిమా లీక్ వెనుక ఎవరి హస్తం ఉంది? అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నది. ఈ లీక్ వివరాల్లోకి వెళితే..
రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్‌ను సెన్సార్ బోర్డు అనేక అభ్యంతరాలు తెలుపడంతో జననాయగన్ సినిమా రిలీజ్ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో అభిమానులు, సినీ ప్రేక్షకుల నిరుత్సాహ పడ్డారు. అయితే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు విజయ్ ప్రత్యర్థులు భారీ దెబ్బ కొట్టారు. గురువారం రోజున ఈ సినిమాను లీక్ చేసి సంచలనం క్రియేట్ చేశారు.

అయితే విజయ్‌ను ఇబ్బందులకు గురి చేయడానికి ఈ లీక్ వ్యవహారం చేపట్టారు. ఇలా లీక్ చేయడం వల్ల వందలాది మంది హార్డ్ వర్క్ బూడిదలో పోసిన పన్నీరైంది. ఎంతో మంది టెక్నిషియన్స్, ఆర్టిస్టులు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లను నష్టపరిచే విధంగా కుట్రలు పన్నారు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాను రిలీజ్‌కు ముందే పైరసీదారులు ఆన్‌లైన్‌లో లీక్ చేయడం తీవ్ర నష్టానికి గురి చేయడమే అనే కామెంట్స్, ఆవేదన సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నది.
సినిమాలను అక్రమంగా పైరసీ చేయడం సీరియస్ క్రైమ్. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వారిని వదిలిపెడితే.. దారుణమైన పరిస్థితులు ఎదురువుతాయి. వారిప చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జన నాయగన్ సినిమాను లీక్ చేసి విజయ్‌ని ఇబ్బంది పెట్టాలనుకొంటే.. కుట్రదారులు ఏమి చేయలేరు అని దళపతి ఫ్యాన్స్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు జరిగినా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ వసూళ్లను రాబట్టి కుట్రదారులను దెబ్బ కొడుతాం అని వారు సవాల్ విసురుతున్నారు. తమిళనాడు ఎన్నికల సమయంలో టీవీకే పార్టీకి ఈ వ్యవహారం లాభం చేకూరుస్తుందా? లేదా అనే విషయంపై సినీ, రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











