అసిస్టెంట్ డైరెక్టర్‌తో హాస్య నటి పెళ్లి.. వీళ్ల ప్రేమ గురించి తెలిస్తే షాకే!
తమిళ రంగానికి చెందిన మరో నటి జాంగిరి మధుమిత పెళ్లిపీటలు ఎక్కబోతున్నది. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న ఈ హాస్యనటి తన ప్రియుడుని వివాహం చేసుకొనున్నది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో మధుమిత పెళ్లికి లైన్ క్లియర్ అయింది. మధుమిత వివాహం వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమలో
గత కొద్దికాలం నుంచి జాంగిరి మధుమిత అసిస్టెంట్ డైరెక్టర్ మోజెస్ జోయల్‌తో ప్రేమలో ఉన్నారు. ఇతను మధుమితకు సమీప బంధువు కూడా. అంతేకాకుండా తన మేనమామ కుమారుడు. 18 ఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య మాటలు లేవు. మా ప్రేమ మళ్లి ఫ్యామిలిని ఒకటి చేసింది అని ఇటీవల ఇంటర్వ్యూలో పేర్కొన్నది.

ఇరుకుటుంబాలు మళ్లీ ఒక్కటై
మోజెస్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది. మోజెస్ కూడా వ్యక్తిగతంగా మంచి వాడు కావడంతో మా కుటుంబానికి అభ్యంతరం లేకపోయింది. నా పట్ల కూడా మోజెస్ కుటుంబం సానుకూలంగా ఉంది. దాంతో ఇరు కుటుంబాలు ఒక్కటై మా పెళ్లిని జరిపించేందుకు ముందుకొచ్చారు అని మధుమిత వెల్లడించింది.

విజయ్ టెలివిజన్‌లో మధుమిత
విజయ్ టెలివిజన్‌లో మధుమిత కామెడీ షో లొల్లూ సభ ద్వారా తమిళ ప్రేక్షకులకు చేరువైంది. ఓరు కల్ ఓరు కన్నాడి చిత్రంలో తమిళ సినీ రంగంలోకి ప్రవేశించింది. నటుడు సంతానంకు జంటగా జాంగిరి అనే పాత్రలో నటించింది. అప్పటి నుంచి మధుమిత జాంగిరి మధుమితగా మారిపొయింది.

50కి పైగా సినిమాల్లో
తమిళ సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు మధుమిత 50కి పైగా చిత్రాల్లో నటించింది. విజయ్ నటించిన జిల్లా, శివకార్తికేయన్ నటించిన కాకి సత్తై, కార్తీ నటించిన కాష్మోరా, విక్రమ్ స్కెచ్ చిత్రంలో నటించి మెప్పించింది. తాజాగా అజిత్, నయనతార నటించిన విశ్వాసం చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











