హోటల్‌లో అమ్మాయితో బూమ్రా.. ఫొటోలో ఉంది అనుపమ పరమేశ్వరన్ అంటూ?
ప్రత్యర్థి జట్టు ఏదైనా గానీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే భారతీయ బౌలర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది జస్ప్రిత్ బూమ్రా. మైదానం, ఆట తప్ప మరోటి ఎరుగని ఈ యువ క్రికెటర్ ఈ మధ్య కాలంలో మీడియాలో రకరకాలుగా నానుతున్నాడు. సినీతార అనుపమ పరమేశ్వరన్‌తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తల మధ్య ఆసక్తికరమైన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు ఆ ఫోటోలో ఉన్నది ఎవరనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ ఫోటో గురించి మీకోసం
మైదానంలోనే కాకుండా
మైదానంలో బంతితో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను దడదడలాడించే క్రికెటర్లకు సినీ తారలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయనేది కొత్త కాదు. అదే క్రమంలో జస్ప్రిత్‌పై వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్ జరిగిన తర్వాత హోటల్‌లో ఓ అమ్మాయి భుజంపై చేయి వేసి నడుస్తుండగా కెమెరా క్లిక్ మనిపించింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోపై భారీగా కామెంట్లు కనిపించాయి.

అమ్మాయి అడుగులో అడుగేస్తూ
అమ్మాయి అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న ఫొటోను జస్ప్రిత్ బూమ్రా ట్విట్టర్‌లో ట్యాగ్ చేశాడు. నా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన భుజాన్ని నాకు ఆసరాగా ఇచ్చి ప్రోత్సహిస్తుంది. నాకు నచ్చిన వ్యక్తి గురించి ఎవరు ఏమైనా అనుకొన్న పట్టించుకోను అని ఓ కామెంట్ పెట్టారు. కొందరు అనుపమా పరమేశ్వరన్ కాదుగా అంటూ సందేహం వ్యక్తం చేశారు. అలాగే ఫొటోలో ఉన్న వ్యక్తిని తల్లిగా భావించి.. దేశానికి కొడుకుగా మారే కుమారుడిని కన్నతల్లి అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.

సినీ తారతో డేటింగ్?
ఆటతోనే కాకుండా అఫైర్ వార్తలతో జస్ప్రిత్ బుమ్రా సోషల్ మీడియాను కుదిపేస్తున్నాడు. దక్షిణాది సినీ తార అనుపమా పరమేశ్వరన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. దాంతో అనుపమ పరమేశ్వరన్ వివరణ ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని చెప్పినట్టు కథనాలు వెలువడ్డాయి.

అనుపమా పరమేశ్వరన్ క్లారిటీ
క్రికెటర్ బూమ్రాతో పరిచయం ఉంది. అతను నాకు మంచి ఫ్రెండ్. అంతేగానీ మీడియాలో వచ్చినట్టు డేటింగ్ చేయడం లేదు. సోషల్ మీడియాలో ఇలాంటి ఊహగానాలకు తెరదించాలి అని అనుపమా పరమేశ్వరన్ మీడియాతో అన్నట్టు వార్తలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











