Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జయలలిత బయోపిక్: ఆ వివాదాలు, కేసులపైనే అందరి దృష్టి!
దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత జీవితం ఆధారంగా త్వరలో బయోపిక్ రాబోతోంది. ఈ సినిమాను ఆమె జయంతి సందర్బంగా ఫిబ్రవరి 24, 2019న లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే రోజున ఫస్ట్ లుక్‌తో కూడిన టైటిల్ పోస్టర్ విడుదల చేయబోతున్నారు. 'మద్రాసి పట్టణం' మూవీకి దర్శకత్వం వహించిన తమిళ ఫిల్మ్ మేకర్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం జయలలిత బయోపిక్కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నవారే!
తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్, హిందీలో 83 చిత్రాలను నిర్మిస్తున్న విబ్రి మీడియా పతాకంపై ఈ చిత్రం రూపొందబోతోంది. విష్ణు వర్ధన్ ఇందూరి, బృంద ప్రసాద్ నిర్మాతలు. ఇందులో బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు నటించబోతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించబోతున్నారని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
|
జయలలిత బయోపిక్
ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు జయలలిత 140కిపైగా చిత్రాల్లో నటించారు. బయోపిక్‌లో ఆమె సినీ రంగ ప్రవేశం, రాజకీయాల్లోకి ఎదిగిన వైనం లాంటివి చూపించబోతున్నారు.
వివాదాలు, కేసులు
తమిళనాట గొప్పనేతగా జయలలిత గుర్తింపు పొందారు. అదే సమయంలో ఆమె రాజకీయ జీవితంలో అనేక వివాదాలు, కోర్టు కేసులు ఉన్నాయి. మరి బయోపిక్‌లో ఇవన్నీచూపిస్తారా? జయలలిత చివరి రోజుల్లో జరిగిన హైడ్రామా సినిమాలో ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.
శోభన్ బాబు ఎపిసోడ్ ఉంటుందా?
జయలలిత, శోభన్ బాబు ప్రేమించుకున్నారని... వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, వీరికి ఓ బిడ్డ కూడా ఉందనే రూమర్స్ ఉన్నాయి. ఈ విషయమై బయోపిక్ ద్వారా అయినా ఓ క్లారిటీ వస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.