జయలలిత బయోపిక్ ‘తలైవి’ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..

సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఎఎల్ విజయ్ దర్శకత్వంలో 'తలైవి' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరకాలంగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన శేలేష్ ఆర్ సింగ్ ఓ తమిళ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...'ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. టెక్నీషియన్స్ అందరూ ఆన్ బోర్డులోకి వచ్చారు. కంగనా ప్రస్తుతం ఈ పాత్ర ఎలా చేయాలనే విషయంలో ప్రిపేర్ అవుతోంది. తమిళ డిక్షన్, క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. అక్టోబర్ మొదటి వారంలో సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

Jayalalitha biopic Thalaivi will commence from October

ఈ మూవీ షూటింగ్ మైసూరులో మొదలై... చెన్నైలో కంటిన్యూ అవుతుందని తెలుస్తోంది. తమిళం, హిందీ ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో కూడా ఈమూవీ అనువాదం కానుంది. బాహుబలి డైరెక్టర్ కె విజయేంద్రప్రసాద్, రాహుల్ అరోరా కథ అందించారు. ఇందులో తమిళంతో పాటు పలువురు హిందీ యాక్టర్లు నటించబోతున్నారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో నిర్మాత విష్ణు ఇందూరి మాట్లాడుతూ... 'ఈ చిత్రానికి కంగనా రనౌత్ పర్ఫెక్టుగా సూటవుతుంది, జయలలిత పాత్రను ఆమె అద్భుతంగా చేస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ..'తలైవి చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నాం, అందుకే ఇండియాలో బెస్ట్ స్టార్లలో ఒకరైన కంగనాను ఎంచుకున్నాం.' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X