జయలలిత బయోపిక్ ‘ఐరన్ లేడీ’లో నిత్యా మీనన్

Recommended Video

Nithya Menen To Play J Jayalalithaa In A Biopic Titled As The Iron Lady

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ ప్రజల ఆరాధ్య నాయకురాలు, దివంగత జయలలిత జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ఐరన్ లేడీ' అనే టైటిల్ ఫైనల్ చేస్టూ టైటిల్ లోగో విడుదల చేశారు.

జయలలిత పాత్రకు నిత్యా మీనన్‌ను ఎంపిక చేసినట్లు డైరెక్టర్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'ఆరు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపించబోతోంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి ప్రకటిస్తామని దర్శకురాలు ప్రియదర్శిని స్పష్టం చేశారు.

Jayalalitha biopic titled The Iron Lady

సినిమాకు 'ఎ స్టోరీ ఆఫ్ రెవొల్యూషనరీ లీడర్' అనే సబ్ టైటిల్ ఉండటాన్ని బట్టి చూస్తే ఇందులో ఆమె పొలిటికల్ జీవితాన్నే ఎక్కువ ఫోకస్ చేస్తారని స్పష్టమవుతోంది. దీంతో పాటు సినిమా పోస్టర్ మీద జయలలితను స్ట్రాంగ్ లేడీగా, ఇతరులతో పోల్చలేని రాజకీయ నేతగా పొగుడుతూ హిల్లరి క్లింటన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఉంచడం గమనార్మం.

2002 నుండి 2006 మధ్య కాలంలో తమిళనాడులో అధికారంలో ఉన్న సమయంలో జయలలిత ఐరన్ లేడీ అనే పేరు సంపాదించుకున్నారు. అదే సమయంలో ఆమె స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకోవాలని స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం గమనార్హం. 'ఐరన్ లేడీ' చిత్రాన్ని పేపర్‌టేల్ పిక్చర్స్ వారు నిర్మించబోతున్నారు. ఈ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X