రాజా దర్శకత్వంలో ప్రభాస్!

తనను తాను నిరూపించుకునేందుకు తనలోనూ ఒరిజల్ ఐడియాలు ఉన్నాయని చెప్పుకునేందుకు డైరక్ట్ సినిమా ప్రభాస్ హీరోగా చేస్తానంటున్నాడు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుతున్నానని, దీని కోసం జబ్ వుయ్ మెట్ రీమేక్ ఆఫర్ వచ్చినా వదులుకున్నానని చెబుతున్నాడు. అంతేగాక నిజంగా రీమేక్ చేసి హిట్టు కొట్టడమనేది చాలా కష్టమనీ, నేటివిటీకి మార్చి మెప్పించటం మామూలు విషయం కాదని చెప్తున్నాడు.
అలాగే తనకు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఉండే కథలంటే ఇష్టమనీ ప్రభాస్ అంటే తెలుగులో ఇష్టమనీ అతని బాడీ లాంగ్వేజ్ కి అణుగుణంగా కథ తయారు చేసానని హిట్టు కొడతానని,తన తండ్రి ఎడిటర్ మోహన్ నిర్మాతగా వ్యవహిస్తాడని అంటున్నాడు. ఈ విషయాలన్నీ ఈ మధ్య ఓ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. వరస ఫ్లాఫుల్లో ఉన్న ప్రభాస్ కి అతనైనా హిట్టు ఇస్తే బాగుండునని ఆశిద్దాం. అయితే రీమేక్ లు అలవాటైన అతను స్ట్రైయిట్ సినిమా అంటే ప్రయోగమో కదా...చూద్దాం.ప్రస్తుతం ప్రభాస్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భిల్లా రీమేక్ లో చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











