ఆ హీరోయిన్ నా లైఫ్‌ను నాశనం చేసింది.. జయం రవి టార్గెట్ చేసిన ఇడ్లీ నటి అమేనా?

భార్య ఆర్తీతో విడాకులు, గర్ల్‌ఫ్రెండ్ కెనిషా ఫ్రాన్సిస్‌తో బ్రేకప్ తర్వాత తమిళ నటుడు జయం రవి అలియాస్ రవి మోహన్ శనివారం (మే 16వ) చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించి ఎమోషనల్ అయ్యారు. భార్య నుంచి విడాకులు పొందకుండా తనను వేధిస్తున్నారు. కెనీషా నుంచి నన్ను దూరం చేశారు. ప్రస్తుతం నా జీవితం నరక ప్రాయంగా మారిందనే విధంగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలాంటి వేధింపుల వల్ల నా జీవితం ఏదో ఒక రోజు ముగిసి పోతుంది. ఆ లోపు కొందరి జీవితాలకు గుణపాఠం నేర్పుతా అంటూ ఓ దశలో ఆవేశంగా, ఘాటుగా స్పందించాడు. అయితే తన జీవితాన్ని ఓ సీనియర్ నటి నాశనం చేసింది. ఆమె ఎన్నో కాపురాలను కూల్చింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. రవి మోహన్ చేసిన ఆ నటి ఎవరు? రవి మోహన్‌కు సదరు నటి ఇచ్చిన కౌంటర్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

భార్యతో విడాకుల తర్వాత తనను సోషల్ మీడియాలోను, యూట్యూబ్‌లోనే వేధింపులకు పాల్పడ్డారు. అదే పనిగా పీఆర్‌ను ఉపయోగించి భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేసి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, వేధింపుల కారణంగానే కెనీషా తన నుంచి దూరం వెళ్లిపోయారు. నా మాజీ భార్య ఫ్యామిలీ వేధింపులు తట్టుకోలేక కొన్నిసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను అని రవి మోహన్ ఓ దశలో భోరున విలపించారు.

Jayam Ravi vs Kushbu

నాపై దారుణంగా దుష్ప్రచారం జరుగుతున్నది. సోషల్ మీడియాలో దూషణలు ఎక్కువైనాయి. అయినా సహనం, ఓపికతో వేచి చూశాను. ఏదో ఒక రోజు వాస్తవం బయటకు వస్తుంది. న్యాయం నాకు దక్కుతుందని ఎదురు చూస్తున్నాను. ఫెమినిజం పేరుతో నాపై ఆన్‌లైన్‌లో దాడులు చేస్తున్నారు. చాలా మంది నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని రవి మోహన్ అన్నారు.

ఆర్తీతో పెళ్లి విషయంలో నా తల్లిదండ్రులు, కుటుంబం అభ్యంతరం తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించారు. వారి మాటలను పెడచెవిన పెట్టాను. కానీ ఈ రోజు పరిణామాలను బాధతో అనుభవిస్తున్నాను. నా తల్లిదండ్రులు చెప్పిన వినకపోవడం ఎంత పెద్ద తప్పో తెలుస్తున్నది అని ఆయన అన్నాడు.

నా జీవితం నాశనం కావడానికి కారణం ఓ సీనియర్ నటి. మూడు అక్షరాలు ఉన్న ఇడ్లీ నటి. ఆమె నా లైఫ్‌తో ఆడుకొన్నది. ఆమె ఎన్ని కుటుంబాలను కూల్చిందో నేను చెప్పాలా? ఫెమినిజం పేరుతో ఆమె కాపురాలను కూల్చుతున్నది అంటూ నర్మగర్భంగా జయం రవి సంచలన ఆరోపణలు చేశారు. అయితే రవి మోహన్ చేసిన ఆరోపణలు ఎవరిపై అనే విషయం భారీ చర్చకు దారి తీసింది. అయితే రవి మోహన్ ఆరోపణలు చేసిన సీనియర్ హీరోయిన్ కుష్బూ సుందరం అనే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

అయితే రవి మోహన్ ఆరోపణలు చేసిన కొద్ది సేపటికే సీనియర్ హీరోయిన్ కుష్బూ సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించారు. రవిమోహన్ ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. కొందరి పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. వారి డీఎన్ఏ ఏమిటో రుజువు చేసుకొన్నారు. కానీ నేనేంటో సరిగా చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ కుష్బూ సుందర్ ట్వీట్ చేసింది. అయితే రవి మోహన్‌కే ఈ కౌంటర్ ఇచ్చారనే విషయాన్ని నెటిజన్లు ధృవీకరిస్తున్నారు.

Read more about: jayam ravi aarthi kushbu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X