కాజల్‌తో రెండు సార్లు సెట్ కాలేదు.. ఈ సారి మాత్రం ఫుల్ రొమాన్స్.. జయం రవి

కాజల్ అగర్వాల్.. తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో సుపరిచితమైన హీరోయిన్. సౌత్ ఇండియాన్ తెరపై స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించింది. ప్రస్తుతం జయం రవి సరసన 'కోమాలి', శర్వానంద్ సరసన 'రణరంగం' సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఆగస్టు 15 న విడుదల అకానుండటం విశేషం. కోమాలి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన జయం రవి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

కోమలి చిత్రంలో రొమాన్స్‌ డోస్ చాలా ఎక్కువగా ఉంటుందని జయంరవి అన్నాడు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని చిత్రాలకు భిన్నమైన సన్నివేశాలు కోమాలిలో ఉంటుందని చెప్పాడు. ప్రతీ ఫ్రెమ్ లోనూ రొమాన్స్ తో కూడిన కామెడీ, సెంటిమెంట్‌ ఉంటుందని, అదే ఈ సినిమాకు హైలైట్‌ అవుతుందని జయం రవి అన్నాడు. ఇక కాజల్ తో కాంబినేషన్ గురించి మాట్లాడిన ఆయన.. నిజం చెప్పాలంటే గతంలోనే రెండుసార్లు కాజల్ తో ఆఫర్ మిస్ అయ్యానని, ఆ అవకాశం ఈ సినిమా దక్కుతోందని అన్నాడు. ఆమె పాత్ర పరిధి చిన్నదైనా ఈ సినిమా కోసం అడగగానే కాజల్ ఓకే చెప్పేసింది జయం రవి తెలిపాడు.

Jayam Ravi Comments On Kajal Aggarwal
ఇక కోమాలి సినిమా విషయానికొస్తే.. కొత్త దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చిత్రంలో జయం రవి హీరోగా నటించగా ఆయన సరసన కాజల్‌ అగర్వాల్, సంయుక్త హెగ్డేలు హీరోయిన్లుగా నటించారు. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరిగణేశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్‌హాప్‌ తమిళా సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X