జయం రవితో కెనీషా అఫైర్ .. షాకిచ్చిన హీరో భార్య, ఆ పోస్ట్‌లతో!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి అఫైర్, విడాకుల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం గురించి ఎవరో ఒకరు ఏదో రకంగా స్పందిస్తూనే ఉన్నారు. ఓ పెళ్లిలో మొదలైన రచ్చ పాత విషయాలను తవ్వుతూ హీరోగారి పరువును బజారులో పడేసింది. ఇల్లాలు, ప్రియురాలు మధ్యలో నలిగిపోతున్న జయం రవి ఏ రకంగా బయటికొస్తారోనని ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా జయం రవి భార్య ఆర్తి రవి షాకిచ్చారు.
వరుస పోస్ట్‌లతో ఆర్తి రవి హల్‌చల్
కెనీషాతో జయం రవి కనిపించిన నాటి నుంచి తమ బంధం ఎలా బీటలు వారిందో, తన భర్తలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఆర్తి రవి వరుసగా పోస్టుల ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. మూడో మనిషి కారణంగానే తమ రిలేషన్ దెబ్బతిని విడాకులకు దారి తీసింది తప్పించి డబ్బు, అధికారం కాదని ఆర్తి క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి కేనీషా తమ జీవితంలోకి వచ్చాకే సమస్యలు మొదలయ్యాయని ఆర్తి రవి పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లయ్యింది.

ఆర్తికి జయం రవి కౌంటర్
పిల్లలను, ఇంటి బాధ్యతలను జయం రవి పట్టించుకునేవారు కాదని ఆర్తి ఆరోపించారు. డబ్బుకు మాత్రమే విలువనిచ్చారని, పిల్లల కోసమే ఇన్నాళ్లు నేను మౌనంగా భరిస్తున్నానని చెప్పారు. తండ్రి అంటే ఓ టైటిల్ కాదని అదొక బాధ్యత అని ఆర్తి దుయ్యబట్టారు. దీనికి కౌంటర్‌గా జయం రవి కూడా సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌లు పెట్టేవారు. చివరి వరకు వైవాహిక బంధాన్ని నిలుపుకోవాలనే నేను ప్రయత్నించా, కానీ ఓపిక నశించి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. తన కన్న తల్లిదండ్రులను కలిసేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కెనీషాకు బెదిరింపులు
ఈ వివాదం తారాస్థాయిలో ఉండగానే తనను చంపేస్తానని, రేప్ చేస్తామని బెదిరిస్తున్నారంటూ జయం రవి ప్రియురాలు కెనీషా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను తప్పు చేశానని మీరంతా భావిస్తే కోర్టు ముందు నిలబెట్టాలని.. న్యాయస్థానం ఏ శిక్ష వేసినా దానికి సిద్ధమేనని కెనీషా తెలిపారు. తనపై ట్రోలింగ్ తీవ్రం కావడంతో నెటిజన్లకు ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా అభ్యంతరకర సందేశాలు పంపితే స్క్రీన్ షాట్ల ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని కెనీషా వార్నింగ్ ఇచ్చింది.
నెలకు 40 లక్షల భరణం కోరిన ఆర్తి
వివాదం బాగా ముదిరిన కారణంగా ఆర్తి రవితో వైవాహిక బంధాన్ని కొనసాగించే ఉద్దేశం తనకు లేదని జయం రవి న్యాయస్థానానికి తేల్చిచెప్పారు. విడాకులకు తన భర్త సిద్ధమైన నేపథ్యంలో తనకు భరణం కింద నెలకు రూ.40 లక్షలు చెల్లించాలని ఆర్తి రవి కోర్టుకు తెలియజేశారు. దాంతో జయం రవి నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆర్తి రవి కోరిన మొత్తాన్ని చెల్లించేందుకు జయం రవి అంగీకరిస్తారా? లేక మరేదైనా ప్రతిపాదన చేస్తారా? అని చర్చించుకుంటున్నారు.
షాకిచ్చిన ఆర్తి రవి
అయితే జయం రవి- ఆర్తిలు పబ్లిక్‌గా రచ్చ చేస్తుండటంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే పోస్టులను పెట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. కోర్ట్ ఆదేశాల మేరకు ఆర్తి రవి బిగ్ షాకిచ్చింది. జయం రవితో వివాదం గురించి చేసిన పోస్టులన్నింటినీ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించింది. అలాగే మోహన్‌కు సైతం లీగల్ నోటీసులు పంపిన ఆర్తి.. తనతో పాటు తన తల్లిపై పోస్టులు చేయొద్దని అందులో పేర్కొంది. దీనిని పరిశీలించిన హైకోర్టు.. ఆర్తి, సుజాతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ఇప్పటికే తమ విభేదాల గురించి మాట్లాడటం మానేయాలని ఆర్తి, సుజాతలకు జయం రవి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా ఆర్తి కూడా ఇదే విధంగా స్పందించడం గమనార్హం. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











