‘భార్యగా అలా వెన్నుపోటు.. ఇప్పుడు ఏకంగా డైరెక్టుగా ఛాతిలోనే కత్తిపోటు’

తమిళ నటుడు జయం రవి అలియాస్ రవి మోహన్ తొలిసారి తన భార్యతో ఉన్న అభిప్రాయ బేధాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు తన ఫ్యామిలీ రిలేషన్స్ గురించి ఎన్నడూ మీడియాకు ఎక్కని ఆయన సుదీర్ఘమైన లేఖను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పటికే వేర్వేరుగా ఉంటున్న భార్య ఆర్తీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్తీ తనను చాలా దారుణంగా వేధించిందని ఆరోపించారు. భార్య ఆర్తీ నుంచి విడాకుల తీసుకొనేందుకు రవి మోహన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కన్నడ సింగర్‌తో కలిసి సహ జీవనం చేస్తున్నారనే వార్తల మధ్య భార్య చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయన విడుదల చేసిన సోషల్ మీడియా పోస్టు వివరాల్లోకి వెళితే..

రవి మోహన్‌పై భార్య ఆర్తీ ఇటీవల కాలంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తనతో కాపురం చేసిన సమయంలో పిల్లలను పట్టించుకొనే వాడు కాదు. తనను రకరకాలుగా వేధించే వాడు అంటూ చేసింది. అయితే తన భార్య చేసిన కామెంట్స్ గురించి రవి తొలిసారి పూర్తి వివరాలు, సాక్ష్యాలతో తన ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డారని సోషల్ మీడియా పోస్ట్ తెలిపింది.

Jayam Ravi emotional letter on Wife Aarti

నా భార్య చేసిన నాపై చేసిన ఆరోపణలపై నిజాలు, వాస్తవాలు చెప్పాలని నిర్ణయించుకొన్నాను. నా మాజీ భార్యతో దాంపత్య జీవితం నుంచి విడిపోవడానికి దారి తీసిన సంఘటనలను చెబుతాను. నేను నా భార్యకు దూరమయ్యానే కానీ నా పిల్లలకు ఎన్నడూ దూరంగా లేను. నాకు నా పిల్లలంటే చెప్పలేనంత ప్రేమ. నా ఇద్దరు కొడుకుల కంటే నాకు మరో ప్రపంచం లేదు. నా జీవితంలో వారిద్దరూ అత్యంత కీలకమైన వారు. ఎలాంటి షరతులు లేకుండా వారికి ప్రేమ, వారి సంరక్షణ చూసుకోవడం నా బాధ్యతనే అని రవి మోహన్ వెల్లడించారు.

నా భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్దమైన సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం వారికి భరణాన్ని చెల్లిస్తున్నాను. కారు ప్రమాదం వల్ల నా ఆరోగ్యం దెబ్బ తిన్నది. దాని వల్ల నేను చాలా నష్టపోయాను. నేను ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను. నా పిల్లల భవిష్యత్ నాకు ముఖ్యం అని రవి మోహన్ అన్నారు.

Jayam Ravi emotional letter on Wife Aarti

నాపై చేసే ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ఆరోపణల గేమ్‌ను ఆపేసేయ్. నీవు పెట్టిన మానసిక, శారీరక క్షోభ, ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకొనేందుకు చాలా కష్టపడ్డాను. నీ వల్ల నా తల్లిదండ్రులకు దూరమయ్యాను. పిల్లల సంరక్షణ, విడాకుల వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. కోర్టు తెల్చే వరకు అసత్య ప్రచారం చేయకు అని రవి మోహన్ తన లేఖలో పేర్కొన్నారు.

నీతో వైవాహిక జీవితం కొనసాగినన్నీ రోజులు నన్ను నీవు వెన్నుపోటు పొడిచావు. ఇప్పుడు మాత్రం ముందు నుంచి డైరెక్టుగా ఛాతిలోనే కత్తిని దించుతున్నావు. ఇక ముందు నేను నీకు ఏమీ వివరణ ఇవ్వను. ఇదే చివరిసారి. నీవు క్షేమంగా బతుకు..ఇతరులను అంతే క్షేమంగా బతకనివ్వు అని ఘాటైన సుదీర్ఘమైన లేఖను పోస్టు చేశారు.

More from Filmibeat

Read more about: jayam ravi aarti kenishaa francis
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X