భార్యాబిడ్డలను వదిలేసి సింగర్‌తో సహజీవనం?.. హీరోకి చీవాట్లు పెట్టిన హీరోయిన్లు
దేశంలో ప్రస్తుతం సెలబ్రెటీల డైవర్స్, ఇతర పంచాయతీలకు సంబంధించిన వార్తలు ఎక్కువయ్యాయి. నిత్యం ఏదో ఒక ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒక స్టార్ వ్యక్తిగత జీవితం, ఎఫైర్లు, విడాకుల మేటర్స్ బయటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ విడాకులు, సింగర్‌తో సహజీవనం వ్యవహారం దక్షిణాదిలో కలకలం రేపింది. చట్టపరంగా తమకు విడాకులు మంజూరు కాకుండానే తన భర్త పరాయి మహిళతో కనిపించడంతో జయం రవి భార్య ఆర్తి రవి రగిలిపోతోంది.
15 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన రవి- ఆర్తి
ఆర్తితో విభేదాల కారణంగా ఆమెకు విడాకులు ఇవ్వాలని జయం రవి నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా తాము విడిపోతున్నట్లు, 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు జయం రవి తెలిపారు. ఈ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఆ విడాకుల వ్యవహారం నడుస్తుండగానే హీరోయిన్ ప్రియాంక మోహన్‌తో జయం రవి రిలేషన్‌లో ఉన్నారంటూ గాసిప్స్ వచ్చాయి. ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లుగా ఫోటోలు బయటికి రావడంతో ఈ పుకార్లకు బలం చేకూర్చినట్లయ్యింది. దీనిపై స్పందించిన ప్రియాంక.. ఆ ఫోటోలో ఓ సినిమాలోనివి, తనను జయం రవి విడాకుల ఇష్యూలోకి లాగొద్దని తేల్చి చెప్పింది.

పెళ్లి వేడుకలో జంటగా జయం రవి - కేనీషా
ఆ వెంటనే సింగర్, థెరపిస్ట్ కెనీషా ఫ్రాన్సిస్‌తో జయం రవి ప్రేమాయణం సాగిస్తున్నారని.. ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని తమిళ మీడియా కథనాలు మొదలెట్టింది. అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని.. మానసిక సమస్యలతో బాధపడుతున్న రవికి డాక్టర్‌గా ట్రీట్‌మెంట్ చేస్తున్నానని కేనిసా క్లారిటీ ఇచ్చింది. ఈ దశలో రవి, కేనీషాలు చెన్నైలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో జంటగా కనిపించడం అనుమానాలకు తావిచ్చింది. వీరిద్దరూ కలిసున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జయం రవి తీరుపై ఆర్తి రవి ఆవేదన
ఆ వెంటనే జయం రవి భార్య ఆర్తి రవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనతో 18 ఏళ్లు కలిసున్న వ్యక్తి ఇలా చేస్తున్నారని.. ఆయనకు లెక్కలే ముఖ్యమంటూ ఆరోపించారు. పిల్లల బాధ్యతను కూడా పట్టించుకోకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విడాకుల మంజూరు ప్రక్రియ ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని అప్పటి వరకు తన పేరు ఆర్తి రవియేనని తేల్చిచెప్పింది. ఓ భార్యగా, అన్యాయానికి గురైన స్త్రీగా, ఓ తల్లిగా నేను మాట్లాడుతున్నానని .. తండ్రి అంటే ఏదో టైటిల్ కాదని అదో బాధ్యత అని ఆర్తి రవి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆగ్రహం చూస్తుంటే జయం రవి- కేనీసాల ఎఫైర్ నిజమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఆర్తి రవికి రాధిక, ఖుష్బూ బాసట
ఈ నేపథ్యంలో ఆర్తి రవికి సీనియర్ హీరోయిన్లు రాధికా శరత్ కుమార్, ఖుష్బూ సుందర్‌లు అండగా నిలిచారు. ఈ మేరకు వీరిద్దరూ ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు. ఒక తల్లి చెప్పే నిజం కాలంతో పాటు సాక్ష్యాధారంగా ఉంటుందని ఖుష్బూ ట్వీట్ చేశారు. శ్రీదేవి శ్రీధర్ అనే మహిళ చేసిన ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ స్ట్రాంగ్‌గా ఉండమని ఆర్తికి సూచించారు రాధిక. ప్రస్తుతం తన పిల్లలతో విడిగా ఉంటున్న ఆర్తి రవికి చిత్ర పరిశ్రమ నుంచి మద్ధతు లభిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











