మా అఫైర్ గురించి మీకెందుకు? మూసుకొంటారా? ఖుష్బూకి జయం రవి లవర్ వార్నింగ్

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవితో సింగర్, థెరపిస్ట్ కెనీషా ఫ్రాన్సిస్ రిలేషన్ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. తొలుత మా ఇద్దరి మధ్య స్నేహం తప్పించి ఎలాంటి బంధం లేదన్న కెనీషాతో జయం రవి ఓ వివాహ వేడుకలో ప్రత్యక్షం కావడం వివాదాస్పదమైంది. వీరిద్దరి ఎఫైర్ గురించి జయం రవి భార్య ఆర్తి రవి ఘాటుగా స్పందించడంతో నాటి నుంచి ఈ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ ఇష్యూపై కెనీషా ఫ్రాన్సిస్ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

జయం రవి రిలేషన్‌పై పుకార్లు

తమ 15 ఏళ్లు వైవాహిక బంధానికి తెరదించుతూ గతేడాది జయం రవి - ఆర్తి రవిలు వైవాహిక బంధానికి చెక్ పెట్టారు. ఆ సమయంలో హీరోయిన్ ప్రియాంక మోహన్, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో జయం రవి రిలేషన్‌లో ఉన్నట్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ప్రియాంక, కెనీషా ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. జయం రవి తమకు స్నేహితుడని కేవలం వృత్తిపరమైన అనుబంధం తప్పించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ప్రియాంక ఇష్యూ సైడ్ అవ్వగా.. కెనీషాతో మాత్రం రవి ఇంకా క్లోజ్‌గానే ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తూనే ఉంది.

jayam ravi kenishaa francis relation singer indirect warns kushboo and radhika sarathkumar for supporting Aarti Ravi

పెళ్లిలో జంటగా జయం రవి - కెనీషా

ఇలాంటి దశలో రవి, కేనీషాలు ఓ నిర్మాత కుమార్తె వివాహ కార్యక్రమానికి జంటగా హాజరవ్వడం అనేక అనుమానాలకు తావిచ్చింది. వీరిద్దరూ కలిసున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలతో జయం రవి భార్య ఆర్తి రవి స్పందించడంతో పాటు రవి తీరును ఎండగట్టారు. తమ విడాకుల వ్యవహారంపై కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రవి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానం తమ సంగతి తేల్చేవరకు తన పేరు ఆర్తి రవియేనని తేల్చిచెప్పింది.

ఘాటుగా స్పందించిన ఆర్తి రవి

భర్తగా, తండ్రిగా తను నిర్వర్తించాల్సిన బాధ్యతల నుంచి రవి తప్పించుకున్నాడని ఆమె మండిపడ్డారు. ఓ భార్యగా, అన్యాయానికి గురైన స్త్రీగా, ఓ తల్లిగా నేను మాట్లాడుతున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్తి రవి ఈ స్థాయిలో స్పందించడంతో జయం రవి - కెనీషాల ఎఫైర్ నిజమేనా అన్న అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి.

మీ పనులు మీరు చూసుకోండి

ఆర్తి రవి స్పందన నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు రాధికా శరత్ కుమార్, ఖుష్బూ సుందర్‌లు ట్విట్టర్ ద్వారా స్పందించారు. వీరితో పాటు మరికొందరు సినీ పెద్దలు, అభిమానులు కూడా ఆర్తికి అండగా నిలుస్తూ.. కెనీషాపై మండిపడుతున్నారు. దీంతో కెనీషా ఘాటుగా స్పందించింది. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి.. అంతేకానీ పీఆర్‌లను వాడొద్దని మండిపడింది.

Take a Poll

కొందరు సొంత విషయాలు వదిలేసి కేకలు వేస్తున్నారని అలాంటి వారు నా ముందుకు రండి అంటూ పరోక్షంగా ఖుష్బూ , రాధిక తదితరులకు వార్నింగ్ ఇచ్చారు కెనీషా. మీరంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కెనీషా వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. మరి దీనిపై ఆర్తి రవి ఎలా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X