సింగర్ కెనీషాతో జయం రవి అఫైర్‌?.. మోసగాడంటూ హీరో భార్య షాకింగ్ పోస్ట్

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ ఇటీవల వార్తల్లో నిలుస్తున్నాడు. సింగర్, థెరపిస్ట్ కెనీసా ఫ్రాన్సిస్‌తో ఆయన క్లోజ్‌గా ఉంటున్నారని.. ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని తమిళ మీడియాలో ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ దశలో రవి, కేనీషాలో ఓ వివాహ కార్యక్రమంలో కనిపించడం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. వీరి ఎఫైర్ నిజమేనంటూ మీడియా సైతం రకరకాలు కథనాలు ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలో జయం రవి భార్య ఆర్తి రవి స్పందించారు.

భార్యకు విడాకులిచ్చిన జయం రవి

సినిమాల పరంగా మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో జయం రవి సమస్యల ఎదుర్కొంటున్నారు. తన భార్య ఆర్తితో 15 ఏళ్ల బంధానికి ఆయన ముగింపు పలికారు. తాము విడాకులు తీసుకుంటున్నామని, ప్రస్తుతం కోర్టు పరిధిలో కేసు నడుస్తోందని ఇద్దరూ వెల్లడించడంతో కోలీవుడ్ షాక్ అయ్యింది. 2009లో ఆర్తి - జయం రవిల వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారుడు ఆరవ్, ఆయాన్. ఎంతో అన్యోన్యంగా ఉండే జయం రవి - ఆర్తిల మధ్య విడాకులకు దారి తీసిన కారణాలేంటో తెలియరాలేదు.

Jayam Ravi relation With Kenishaa Francis Hero wife Aarti Ravi make sensational post

హీరోయిన్లతో జయం రవి క్లోజ్‌గా

ఆర్తితో విడాకుల తర్వాత హీరోయిన్ ప్రియాంక మోహన్, సింగర్ కేనిషా ఫ్రాన్సిస్‌తో జయం రవి డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. తాము సినిమాపరంగానే కలిసి నటిస్తున్నామని అంతకుమించి ఏం లేదని ప్రియాంక క్లారిటీ ఇచ్చారు. అలాగే కేనీషా కూడా తాను థెరపిస్ట్ కావడంతో మానసిక సమస్యల్లో ఉన్న జయం రవికి ట్రీట్‌మెంట్ చేస్తున్నానని చెప్పారు. ఆర్తి, అతని కుటుంబ సభ్యులు రవిని టార్చర్ చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డాక్టర్, ఆయన పేషేంట్ మాత్రమేనని అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కేనీషా కొద్దినెలల క్రితం ఘాటుగా బదులిచ్చారు.

పెళ్లి వేడుకలో జంటగా రవి - కేనిషా

కట్ చేస్తే వేల్స్ యూనివర్సిటీ ఛైర్మన్ , కోలీవుడ్ బడా నిర్మాత గణేష్ కుమార్ కుమార్తె పెళ్లి వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం తరలి వెళ్లింది. ఈ సందర్భంగా జయం రవితో కలిసి కేనిషా ఫ్రాన్సిస్ ఈ వివాహానికి హాజరుకావడం.. ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చోవడంతో కోలీవుడ్‌లో కలకలం రేపింది. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జయం రవి భార్య ఆర్తి రవి స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

భరిస్తున్నానంటే బలహీనురాలిని కాదు

ఏడాదిగా తాను అన్నింటిని మౌనంగా భరిస్తున్నానని, దీనికి అర్ధం తాను బలహీనంగా ఉన్నానని కాదని ఆర్తి చెప్పారు. నా బిడ్డలే తనకు ముఖ్యమని.. ఈ రోజు లోకమంతా ఫోటోలు, వీడియోలు చూసిందని పరోక్షంగా జయం రవి, కేనీషాలపై కామెంట్స్ చేసింది. తమ విడాకుల మంజూరు ప్రక్రియ ఇంకా జరుగుతోందని.. కానీ 18 ఏళ్లుగా నాకు తోడుగా ఉన్న వ్యక్తి నాకు దూరం కావడమే కాదు, బాధ్యతల నుంచి కూడా దూరమయ్యాడని ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇంటి గురించి నాకు బ్యాంక్ నుంచి సమస్య ఎదురైందని, కానీ నేను లెక్కల కంటే ప్రేమను గౌరవిస్తానని ఆమె పేర్కొన్నారు.

Take a Poll

పిల్లలు అర్ధం చేసుకుంటారు

తన పిల్లలు చిన్నారులని వారికి ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు .. కానీ ఫోన్‌కు స్పందించకపోవడం, మీటింగ్స్ రద్దు, మేసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం వంటివి వారికి అర్ధమవుతుందని ఆర్తి రవి తెలిపారు. ఓ భార్యగా, అన్యాయానికి గురైన స్త్రీగా, ఓ తల్లిగా నేను మాట్లాడుతున్నానని ఆమె పేర్కొన్నారు. తండ్రి అంటే ఏదో టైటిల్ కాదని అదో బాధ్యత అని.. న్యాయస్థానం నుంచి విడాకులపై తుది నిర్ణయం వెలువడే వరకు తాను ఆర్తి రవినే అంటూ ఆమె తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆర్తి రవి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కేనీషా, జయం రవిలు ఎలా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Read more about: jayam ravi kenishaa francis
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X