జయం రవితో అఫైర్.. చంపేస్తామంటూ కెనీషాకు బెదిరింపులు, ఎవరి పని?
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకులు, కెనీషా ఫ్రాన్సిస్‌తో అఫైర్‌కు సంబంధించిన వ్యవహారంలో రోజుకొక పరిణామం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే విడాకులకు సిద్ధమని, ఆర్తితో కలిసి బతకడం తన వల్ల కాదంటూ జయం రవి కోర్టుకు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో జయం రవి నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలంటూ ఆర్తి చేసిన డిమాండ్ కలకలం రేపింది. తాజాగా జయం రవితో రిలేషన్‌లో ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ బాంబు పేల్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
పెళ్లితో మొదలైన వివాదం
కోలీవుడ్ నిర్మాత గణేష్ కుమార్తె పెళ్లిలో కెనీషా - జయం రవిలు కనిపించినప్పుడు మొదలైన ఈ వివాదం నానాటికీ తీవ్రమవుతోంది. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని బుకాయించిన కెనీషా.. రవితో ఎందుకు కనిపించిందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ మధ్యలో ఆర్తి రవి ఎంట్రీ.. దానికి కెనీషా, జయం రవి కౌంటర్‌లతో వివాదం తారా స్థాయికి చేరింది. పలువురు సెలబ్రెటీలు, ప్రజలు ఆర్తి రవికి మద్ధతు పలకగా .. కెనీషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఆర్తి తల్లి సుజాత విజయకుమార్ ఆరోపణలతో ముదిరి పాకాన పడింది. జయం రవి వల్ల తాను 100 కోట్ల అప్పులు చేయాల్సి వచ్చిందని, సాయం చేస్తానన్న వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నాడని ఆమె ఆరోపించింది.

40 లక్షలు భరణం కోరిన ఆర్తి రవి
ఈ దశలో జయం రవి - ఆర్తి రవిలు విడాకుల ప్రాసెస్‌లో భాగంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో హాజరయ్యారు. ఇకపై ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించే ఉద్దేశం లేదని తన లీగల్ టీమ్‌తో కోర్టుకు తెలియజేశారు రవి. అయితే తనకు భరణం కింద నెలకు రూ.40 లక్షలను రవి నుంచి ఇప్పించాలని ఆర్తి రవి డిమాండ్ చేయడంతో కోలీవుడ్ షాకైంది. ఆమె డిమాండ్‌ను జయం రవి సెటిల్ చేస్తాడా? కోర్ట్ సాయంతో ఏదైనా కొత్త ఆఫర్ ఇస్తారా అని చర్చ జరుగుతున్న వేళ కెనీషా ఫ్రాన్సిస్ షాకిచ్చింది.
కెనీషాకు హత్య బెదిరింపులు
తనను చంపేస్తానని కొందరు బెదిరిస్తున్నారంటూ కెనీషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్ షాట్లు పెట్టింది. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఏదీ దాచాలని అనుకోవడం లేదని పేర్కొంది. నన్ను ప్రశ్నించే అధికారం మీకుందని.. ఏదైనా ఉంటే నా ముఖంపైనే చెప్పాలని, మీతో నిజాలు చెప్పాలని నాకూ ఉందని కెనీషా తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న దానికి నేనే బాధ్యురాలినని మీకు అనిపిస్తే కోర్టు ముందు నిలబెట్టాలని ఆమె కోరారు.
ఏ శిక్షకైనా సిద్ధమే
మీ మాటలు, శాపాలతో నేను నరకయాతన అనుభవిస్తున్నా? కానీ కర్మ ఎవరినీ వదలదని మీరు అంటున్నారు.. కానీ వాస్తవాలు తెలిశాక నాలాగే మీరు కూడా ఇంతేనని కెనీషా పేర్కొన్నారు. త్వరలోనే నిజం బయటపడాలి.. తప్పు చేస్తే చట్టం వేసే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తేల్చేశారు. కానీ అప్పటి వరకు తనను ద్వేషించొద్దని, బతకనివ్వాలని కెనీషా ఫ్రాన్సిస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారగా, అసలు కేనీషాను ఎవరు బెదిరిస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











