మరో స్టార్ కపుల్ విడాకులు .. ఒక్క పోస్ట్‌తో తేల్చేసిన టాప్ హీరో భార్య
ఇటీవల కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ కపుల్స్ విడాకుల బాట పడుతుండడం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే పలు జంటలు విడిపోయి వార్తల్లో నిలిస్తే, తాజాగా మరో స్టార్ హీరో తన భార్యతో పెళ్లి బంధానికి వీడ్కోలు పలకబోతున్నాడు అనే రూమర్ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సదరు స్టార్ హీరో భార్య ఓ సోషల్ మీడియా పోస్ట్ తో విషయం ఏంటో తేల్చేసింది. మరి ఈ స్టార్ కపుల్ ఎవరు? వాళ్ళ కథ ఏంటో? ఓ లుక్కేద్దాం పదండి.
ప్రముఖ నటుడు జయం రవి, అతని రొమాంటిక్ భార్య ఆర్తి విడాకులు తీసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమాన్ తన భార్య మోనికాకు విడాకులు ఇవ్వడంతో ఈ ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. తరువాత ఆయన మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆయన విడాకుల నిర్ణయానికి నటుడు శివకార్తికేయన్ కూడా ప్రధాన కారణం అని వార్తలు వచ్చాయి.

ఇమాన్‌ను తరువాత హీరో ధనుష్ తన విడాకుల నిర్ణయాన్ని ప్రకటించి బాంబ్ పేల్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుష్, 18 ఏళ్ల పాటు ఆమెతో కాపురం చేశాడు. అయితే మనస్పర్థల కారణంగా ఈ జంట విడాకుల బాట పట్టారు. ఇరు కుటుంబాల సభ్యులు వారిని కలిపేందుకు ప్రయత్నించగా, వర్కౌట్ కాలేదు.
ఆ తరువాత దర్శకుడు బాలా తన భార్య ముత్తుమలర్‌కు విడాకులు ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇటీవల సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ తన భార్య, సింగర్ చైందవికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. కోలీవుడ్‌లో ఇలా వరుసగా స్టార్స్ విడాకుల వార్తలు హల్‌చల్ చేస్తుండగా, తాజాగా మరో జంట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో ఓ వార్త లీకైంది.

వారు మరెవరో కాదు ప్రముఖ తమిళ హీరో జయం రవి-ఆర్తి దంపతులు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించే పనిలో నిమగ్నమయ్యారు అనే వార్త కోలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ విడాకుల వివాదంపై జయం రవి మౌనం వహించినప్పటికీ, అతని భార్య ఆర్తి మాత్రం సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
తెలుగులో నితిన్ నటించిన జయం మూవీని తమిళంలో జయం రవి చేశారు. ఆ తమిళ జయం చిత్రం విడుదలై 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు ఆర్తి. అందులో 'ప్రేమ అనే పదం.. ఇది మాటలు కాదు జీవితం' అని క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో తనపై వచ్చిన విడాకుల వార్తలను ఆమె కొట్టిపారేసినట్టు అయ్యింది. ఆమె పోస్ట్ చూసి ఇప్పటిదాకా టెన్షన్ పడ్డ జయం రవి అభిమానులు రిలాక్స్ అయ్యారు.


Click it and Unblock the Notifications











