జీవా సూపర్ మ్యాన్ చిత్రం ఫస్ట్ లుక్ ఇదే

By Srikanya

జీవా హీరోగా నటిస్తున్న చిత్రం ముగమూడి. యూటీవీ మోషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్ దర్శకుడు. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జీవా సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. కోలీవుడ్ తెరపైకి తొలిసారిగా రానున్న హాలీవుడ్ స్టైల్ చిత్రం ముగమూడి అని ఆ చిత్ర నిర్మాణ సారధి డి.ధనుంజయన్ అంటున్నారు. వైవిద్యం కోసం తపించే నటుడు జీవా. అందు కోసమే ఆరాటపడే దర్శకుడు మిష్కిన్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమే ముగమూడి.

తమిళంలో మొట్ట మొదటి సారిగా సూపర్‌మ్యాన్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని ధనుంజయన్ తెలిపారు. ఇంతకు ముందు చెన్నైలో వేసిన భారీ ఫిష్ మార్కెట్ సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జీవా సూపర్‌మ్యాన్ గెటప్‌లో కనిపించే ముఖ్య సన్నివేశాలను చెన్నైలో పలు ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలోని సన్నివేశాలను ప్రేక్షకులు తమిళ తెరపై ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరని ఆయన అంటున్నారు.

ముగమూడి పాటలు చాలా బాగున్నాయంటూ ఇళయ దళపతి విజయ్ అభినందించారు. నరేన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కె. సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాటలు చాలా బాగున్నాయన్నారు. జీవా మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. నన్బన్ చిత్రంలో నటించడానికి ముందే ఆయన తనకు తెలుసన్నారు. తన కొడుకు సంజయ్, జీవా వీరాభిమాని అని తెలిపారు. మిష్కిన్ దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ తాను చూశానని అన్నారు. ఆయన చిత్రాలంటే తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు.

జీవా ఈ చిత్రంలో సూపర్ హీరోగా నటిస్తుండడం వల్ల చిత్రం చూడాలనే ఆసక్తి కలుగుతోందన్నారు. నటుడు జీవా, నరేన్, సెల్వి నటి పూజాహెగ్డే, దర్శకుడు లింగుస్వామి, జయంరాజా, వెంకట్ ప్రభు, ఎల్.రెడ్.కుమార్ కన్నన్, కాథిల్, నిర్మాత ఆర్‌బి.చౌదరి, జ్ఞాన వేల్‌రాజా, కమీల నాజర్, యూటీవీ ధనుంజయన్, మిష్కిన్ పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X