బిజీ అవుతున్న జెనీలియా
బొమ్మరిల్లు సక్సెస్ టాక్, దానికి మించి అందులో హాసిని పాత్ర చేసిన తనకు విపరీతమైన ప్రశంసలు రావడంతో దాదాపు అయిపోయిందనున్న జెనీలియా కెరీర్ మళ్లీ మలుపు తిరిగింది. సక్సెస్ ఇచ్చిన తాజా ఉత్సాహంతో జెనీలియా మళ్లీ వడివడిగా ఎగదడానికి అడుగులు వేస్తోంది. ఆమె తాజాగా ఒక తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. ఆ సినిమాలో హీరో భరత్ సరసన జెనీలియా నటించబోతోంది. బాయ్స్ చిత్రంలో కో ఆర్టిస్టు సిద్ధార్థ బొమ్మరిల్లులో మంచి అవకాశం ఇప్పించి, ప్రోత్సహించగా, ఇప్పుడు అదే బాయ్స్‌తో పరిచయం అయిన భరత్ జెనీలియాకు తమిళ రంగంలో బ్రేక్ ఇవ్వబోతున్నాడు. తమిళ చిత్రసీమలో భరత్ పరిస్థితి ఇప్పుడు బాగుంది. అటు తమిళ, మలయాళ, తెలుగు చిత్రసీమల్లో భరత్ సినిమాలు ఇబ్బడిముబ్బడిగా డబ్బింగులై విడుదలవుతూ అతడిని దక్షిణాది స్టార్‌గా పెంచుతున్నాయి.


Click it and Unblock the Notifications