ఆ హీరోతో అమలాపాల్ రెండోసారి.. జెర్సీ రీమేక్ కోసం..
దక్షిణాదిలో వరుస చిత్రాలతో అమలాపాల్ దూసుకెళ్తున్నది. ఆమె సక్సెస్ తర్వాత మరో సెన్సేషనల్ మూవీలో భాగస్వామ్యమయ్యారు. ఆమె చిత్రంలో నగ్నంగా నటించి సెన్సేషన్‌గా మారిన అమలాపాల్ మరో క్రేజీ సినిమాకు సై చెప్పారు. తెలుగులో ఘన విజయం, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్న జెర్సీ తమిళ రీమేక్‌లో నటించేందుకు పచ్చ జెండా ఊపారు.
నేచురల్ స్టార్ నాని, శ్రద్దాశ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన జెర్సీ చిత్రం ప్రస్తుతం తమిళంలో రీమేక్ కానున్నది. కొడుకు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన క్రికెటర్ కథను తమిళ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. క్రికెటర్‌గా నాని పాత్రలో విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ రోల్‌లో అమలా పాల్ నటించనున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల కాలంలో విష్ణువిశాల్, అమలాపాల్ కలిసి నటించడం రెండోసారి. గతేడాది అమలాపాల్, విష్ణు విశాల్‌తో కలిసి తమిళంలో రాక్షసుడు చిత్రంలో నటించారు. సస్సెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. తమిళంలోనే కాకుండా దక్షిణాదిలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఈ హిట్ జంటను మళ్లీ కలిపి జెర్సీ తమిళ రీమేక్‌పై అంచనాలు పెంచారు. అమలాపాల్ కెరీర్ విషయానికి వస్తే, ఆడు జీవితం, ఆదో ఆంధ పారవియా పోలా అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఇక జెర్సీ విషయానికి వస్తే తెలుగులో భారీ విజయాన్ని అందుకొన్న జెర్సీని పలు భాషల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళంలోకి రీమేక్‌గా ఖరారు కాగా, హిందీలో కూడా ఈ సినిమాను పుననిర్మించేందుకు ప్లాన్ చేశారు. సుప్రసిద్ధ నిర్మాత కరణ్ జోహర్ ఈ సినిమాను హిందీలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు సినీ వర్గాల అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











