twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ తలనొప్పి ...మనకేం లబ్ది?

    By Staff
    |

    Deepavali
    2004 లో వచ్చిన సెల్యులర్ (హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ) ఇప్పుడు ఇండియాలో తగువులకు కారణమవుతోంది. దీనిని కాపీ కొట్టడంలో ఎవరికి వారే పోటీపడటం తో ఒకే కథతో తమిళంలో మూడు సినిమాలు మొదలయ్యాయి. అయితే ఒక సినిమా వారు ముందే మేలుకుని పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక నాయకన్ ,వేగం అనే సినిమాలు మిగిలాయి. అయితే ఈ రెండూ ఒకే సారి రిలీజ్ కి వచ్చాయి. ఈ రెండింటిలో ఏది ముందర రిలీజవ్వాలనే తల నొప్పి చోటుచేసుకుంది.అప్పుడు అక్కడి సినిమా పెద్దలు కలగచేసుకుని రహస్య ఒప్పందం ద్వారా వేగం సినిమాను ముందు రిలీజ్ చేసారు.

    అయితే ఆ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమయింది. ఇక ఇప్పడు రెండో వర్గం వారు తమ నాయకన్ సినిమాను సూపర్ స్టార్ సినిమా రిలీజ్ రేంజ్ లో బ్యానర్స్ ,పోస్టర్స్ వేసి,కట్ అవుట్ లు కట్టి విడుదల చేయటానికి రెడీ అవుతున్నారు .విడుదల అయితేనే ఆ సినిమా రిజల్ట్ తేలతుంది. ఇక ఇప్పుడా సినిమాను తెలుగులోకి అంకుశం అనే పేరుతో డబ్బింగ్ చేయటాయని ప్రయత్నం చేస్తున్నారుట. ఇందులో జె.కె.రితీష్ ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఇక్కడ మరో ట్విస్టు పడింది.

    వేణ హీరోగా ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో రూపొందిన దీపావళి చిత్రం కూడా సెల్యులర్ ఫ్రీమేక్ కావంటం నిర్మాతలును ఆందోళనలో పడేస్తోంది. అసలే సినిమా మధ్యంలో డైరక్టర్ ఛేంజయి,సినిమా ఆగిపోయి తిరిగి ఎలాగో తిప్పలు పడి పూర్తి చేస్తే ఇప్పడు ఈ నాయకుడు తన డబ్బింగ్ అంకుశంతో పొడవనుండటం నిజంగా నిజమైన విషాదం. అలాగే ఈ సినిమా ఇప్పటికే హిందీలో క్యాష్ పేరుతో వచ్చి ఫ్లాఫ్ అయింది. మరి రిలీజే కానీ సినిమా ఇక్కడ వారికి నిద్రపట్టకుండా చేయటం విచిత్రం కదా...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X