'కాపీ అని నిరూపించండి!": స్టార్ హీరో ఛాలెంజ్

By Srikanya

మాధవన్ తాజా చిత్రం 'జోడీ బ్రేకర్స్‌' ఇప్పుడు కాపీ వివాదంలో చిక్కుకుంది. ఆ చిత్రం బెల్జియం చిత్రం హార్ట్ బ్రేకర్స్ కు కాపీ అంటూ హార్ట్ బ్రేకర్స్ చిత్రంకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ కంప్లైంట్ చేసారు. దాంతో ఆ చిత్రం హీరో మాధవన్ మండిపడుతున్నారు. తమ చిత్రం ఏ ఇతర చిత్రాలకు కాపీ కాదని,కేవలం టైటిల్ లో సారూప్యం చూసి కాపీ అనటం భావ్యం కాదని అన్నారు. అంతేకాకుండా తాము ఈ చిత్రం స్క్రిప్టుని హార్ట్ బ్రేకర్స్ టీమ్ కు ఇవ్వటానికి సిద్దపడ్డామని,కాపీ అని నిరూపించమనండి..ఒక్క ప్రేమ్ అయినా కాపీ అని అంటూ ఛాలెంజ్ విసిరారు. అయితే ఓ కండీషన్ పెట్టారు. తాము ఈ స్క్రిప్టుని చదవటానికి ఇస్తాము కానీ ఎక్కడా ఈ విషయం చెప్పకూడదని, కథ లీక్ కాకూడదని,అందుకు సంభందించిన నాన్ డిస్ క్లోజర్ ఎగ్రిమెంట్ పై సంతకం చేయాలని కోరారు. అయితే ఈ ఎగ్రిమెంట్ మీద సంతకం పెట్టడానికి ఆ డిస్ట్రిబ్యూటర్స్ వెనకంజ వేసారు.

ఈ విషయమై మాధవన్ మండిపడుతూ..మేము ఆఫర్ చేసాం ..స్క్రిప్టు చదవమని..దానికి వారు వెనకంజ వేస్తే మేం ఏం చేస్తాం..అన్నారు. అంతేగాక వారు ఎగ్రిమెంట్ పై సంతకం చేయటానికి ఎందుకు వెనకంజ వేస్తున్నారని నిలదీసారు. తమ స్క్రిప్టు చదివిన తర్వాత సినిమా విషయమై బయిటకు లీక్ అయ్యితే తాము ఇబ్బందుల్లో పడతామని అందుకే ఆ కండీషన్ పెట్టామని ఆయన అన్నారు. ఇక ఈ చిత్రంలో బిపాసాబసు హీరోయిన్ గా చేస్తోంది. ఇక మాధవన్‌, బిపాసాబసు కలిసి నటించటంపై అందరూ వింతగా చెప్పుకుంటున్న తరుణంలో మాధవన్‌ మాత్రం తమ జోడీ తెరపై మెరుపులు కురిపిస్తుందని చెప్పుకుంటున్నాడు.

''బిపాసా, నేను వెండితెరపై మంచి కెమిస్ట్రీ పండిస్తామని భావిస్తున్నా'' అని తెలిపాడు. రొమాంటిక్‌ కామెడీ చిత్రం 'జోడీ బ్రేకర్స్‌'కు అశ్వనీ చౌధరి దర్శకత్వం వహిస్తున్నారు. జంటలను విడగొట్టడమే పనిగా పెట్టుకునే మాధవన్‌, బిపాసా చివరకు ఎలా ప్రేమలో పడ్డారనేది చిత్ర కథ. ఫిబ్రవరి 24న విడుదల కానున్న ఆ చిత్రంలో ఓమి వైద్య, మిలింద్‌ సోమన్‌, తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X