రజనీకాంత్ పై సూపర్ జోక్
ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పై వచ్చినన్ని జోక్స్ ..మరే స్టార్ హీరోపైనా రావేమో. తాజాగా ఆయన మీద మరో జోక్ ప్రచారంలోకి వచ్చింది. ఆ జోక్ ..."2010 లో రజనీకాంత్ 'రోబో' టైటిల్ తో సినిమా చేసారు..కానీ 3010లో రోబోలు 'రజనీకాంత్' టైటిల్ తో సినిమా చేస్తాయి" ఇప్పుడీ జోక్ నెట్ లో బాగా సర్కులేటింగ్ లో ఉంది. ఇది చదివిన వారంతా మరోసారి రజనీకాంత్ గొప్పతనాన్ని తలుచుకుంటున్నారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో తెరకెక్కబోయే 'కొచ్చాడయాన్' చిత్రం కోసం రజనీ సన్నద్ధమవుతున్నారు.
రజనీకాంత్ తాజాగా 'కొచ్చాడయాన్'అనే ఓ త్రీడీ చిత్రం కమిటైన సంగతి తెలిసిందే.తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రం పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రంలో రజనీకాంత్.. రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఫెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ పరిజ్ఞానంతో ఈ సినిమాను త్రీడీలో చిత్రిస్తారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్', 'ద అడ్వెంచర్ ఆఫ్ టిన్‌టిన్' తరహాలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇక 'రాణా' సినిమా రజనీకాంత్ చేయాలని ఆయన అనుకున్నా ఆరోగ్య సమస్యలతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.


Click it and Unblock the Notifications











