భువేశ్వరి వ్యభిచారం కేసుతో ఆ స్టార్స్ కి మరో ట్విస్ట్
ముగిసిందనుకున్న భువనేశ్వరి వ్యభిచారం కేసు తలనొప్పి తమిళ స్టార్స్ మరో సారి మొదలైంది. చెన్నైలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సినీ నటి భువనేశ్వరి 'ఇంకా చాలమంది నటీమణులు ఇదే వ్యాపారం చేస్తున్నారు. నాతో పాటు వాళ్లను కూడా అరెస్టు చేయండి' అంటూ పోలీసు ఇంటరాగేషన్ లో మరికొందరి పేర్లు చెప్పింది. వాటిని తమిళ దినపత్రిక 'దినమలర్' ప్రచురించింది. దాంతో తారల ప్రతిష్ఠను భంగపరుస్తూ వార్త ప్రచురించడాన్ని నడిగర సంఘం ఇటీవల చెన్నైలో నిరసన ప్రదర్శన జరిపింది. ఈ సందర్భంలో పలువురు తారలు తమ ప్రసంగాల్లో పాత్రికేయులు, వారి కుటుంబాలను కించపరచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఒక జర్నలిస్టు భార్య కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ మొదలైంది.
జర్నలిస్టులను, వారి కుటుంబాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అభియోగంపై పలువురు తమిళ నటీనటులకు శివగంగై జిల్లా కోర్టు నోటీసులు పంపింది. ఐపిసి 499 సెక్షన్ కింద సదరు నటీనటులను శిక్షించాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన మేజిస్ట్రేటు పిటిషన్ లో పేర్కొన్న శ్రీప్రియ, సూర్య, విజయ్ కుమార్, అరుణ్ విజయ్, వివేక్, సత్యరాజ్, శరత్ కుమార్, చరణ్ లకు సమన్లు పంపారు. ఈనెల 19వ తేదీన జరుగనున్న విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని ఆయన ఆదేశించారు.ఇక అప్పట్లో భువనేశ్వరి బయటి పేర్లలో .. సీత, నళని, షకీలా, అంజు, మంజుల విజయకుమార్, శ్రీ ప్రియ, నమిత అన్నారు.


Click it and Unblock the Notifications











