ఇది మన జీవితం.. మనకు నచ్చినట్టుగా బతకాలి..వనిత మూడో పెళ్లిపై కూతురి రియాక్షన్

వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి పెద్ద రచ్చగా మారింది. పీటర్ పాల్‌-వనితా విజయ్ కుమార్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుక సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వివాహం చట్టబద్దం కాదని పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ ఫిర్యాదు చేయడం పెద్ద మలుపుకు దారి తీసింది. పైగా ఈ విషయంలో నటి లక్ష్మీ రామకృష్ణన్ చేసిన కామెంట్స్, వనిత ఇచ్చిన రిప్లై కూడా వివాదానికి దారి తీశాయి. అయితే వీరందరి వాదన ఎలా ఉన్నా వనిత కుమార్తె జోవికాది మాత్రం చాలా స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

మొదటి భార్య ఫిర్యాదు..

మొదటి భార్య ఫిర్యాదు..

తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడని పీటర్ భార్య ఎలిజబెత్ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన భర్త పచ్చి తాగుబోతు, స్త్రీ లోలుడని ఆరోపించింది. తనను నమ్మించి మోసం చేశారని, అది కేవలం షూటింగ్ కోసం జరుగుతున్న పెళ్లి అని నమ్మించారని చెప్పుకొచ్చింది.

విడాకులు ఇవ్వకుండా..

విడాకులు ఇవ్వకుండా..

వనితా విజయ్ కుమార్ పెళ్లి వార్తలలపై నటి లక్ష్మీ రామకృష్ణన్ స్పందిస్తూ.. ఈ వార్తలు ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పటికే పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు కూడా ఇవ్వని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకున్నారు. ఉన్నత చదువులు చదివి, సెలబ్రిటీలుగా ఉన్నవారు ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు. ఈ పెళ్లిని పీటర్ మొదటి భార్య ఎందుకు ఆపలేదు. ఎందుకు ఇంత వరకు ఎదురుచూస్తూ ఉందని ప్రశ్నించింది.

వనిత ఫైర్..

వనిత ఫైర్..

ఓ మగవాడిని మనం ఈజీగా తాగుబోతు, ఆడవాళ్ల పిచ్చి అని తిట్టగలమని వనిత చెప్పుకొచ్చింది. తనకు ఆడవారి కంటే మగవారిలోనే ఎక్కువగా స్నేహితులున్నారని, తాను మగవారినే నమ్ముతాను. కొందరు ఆడవాళ్లు మగవారి కంటే ఎక్కవ కన్నింగ్, జెలసీ ఫీల్ అవుతారని పీటర్ భార్యకు కౌంటర్ వేసింది. మీ పని మీరు చూసుకుంటే మంచిదని లక్ష్మీకి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది.

చాలా సంతోషంగా..

చాలా సంతోషంగా..

ఇలా ఈ మూడో పెళ్లి వ్యవహారం వైరల్ అవుతుండగా.. వనిత కుమార్తె జోవికా పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ‘నేను నీ పట్ల సంతోషంగా ఉన్నాను. గర్వపడుతున్నాను !! మన చిట్టి సంతోషాల్లోకి, సాహసం, ఉత్సాహం, నమ్మకాలతో కూడా మన కుటుంబంలోకి పప్పాను స్వాగతిస్తున్నాను.. ఈ విషయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఇది చివరకు సంపూర్ణంగా కనిపిస్తుంది . ఏదో ఒక రోజు నేను మీలాంటి స్నేహితులను కలిగి ఉంటానని ఆశిస్తున్నాను.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
 మన జీవితం మన ఇష్టం..

మన జీవితం మన ఇష్టం..

నేను 10 సంవత్సరాల నుంచి తెలుసుకుంటూనే ఉంటున్నాను.. కాబట్టి ఎవరైనా నన్ను "మీ కుటుంబం గురించి చెప్పు" అని అడిగినప్పుడల్లా అందులో వచ్చే మొదటి పేర్లు మీదే అవుతాయి. ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతుంటారు.. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. ఇది మన జీవితం.. మనకు నచ్చిన విధంగానే జీవించాలి. ప్రపంచమంతా ప్రేమ నిండి ఉంది.. ప్రేమ నేది ఓ అంటు వ్యాధి లాంటిది అనుకుంటే.. దాని బారిన పడదాం.. కానీ ఎప్పుడూ దానికి అనారోగ్యానికి గురి కాకూడదు. ఇంకా మున్ముందు ఎంతో ఆనందం, సంతోషాలు ఉన్నాయ'ని ఎమోషనల్ పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X