Bad Girl: వివాదంలో బ్యాడ్ గర్ల్.. వెట్రిమారన్‌పై జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్
చిత్ర పరిశ్రమలో ప్రతీ సినిమా పరిస్థితి ఒకేలా ఉండదు. మంచి కంటెంట్ ఉన్నప్పటికీ పలు సినిమాలకి కావాల్సిన ఫేమ్ రాదు ఇంకొన్ని సినిమాలు కంటెంట్ లేకపోయినా మంచి హైప్ తెచ్చుకుంటాయి. ఇక మరికొన్ని సినిమాలు అయితే రిలీజ్ ముందే ఊహించని సంచలనం సెట్ చేస్తాయి.
అది ఒకమ్మాయి కన్ను కొట్టడం అయినా లేక ఒక హీరో డ్రాయర్ లో ఐస్ ముక్కలు వేసుకోవడం అయినా ఇలా పలు అంశాలు మాత్రం ఊహించని రేంజ్ లో ముందే కాంట్రవర్సీ రేపుతాయి. కాగా ఇలా ఇపుడు సౌత్ సినిమా దగ్గర ఊహించని కాంట్రవర్సీ రేపిన చిత్రమే "బ్యాడ్ గర్ల్". తమిళ సినిమా నుంచి లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ రావడంతోనే భారీ ఎత్తున దుమారం రేగింది.

ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాణం వహించడంతో ఆ టీజర్ చూసిన ప్రతీ ఒకరు వెట్రిమారన్ పై నిప్పులు చెరుగుతున్నారు. అయితే అసలు ఆ రేంజ్ ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది అనేది చూద్దాం. ఈ సినిమాలో ఒక బ్రాహ్మణ అమ్మాయిని చాలా బోల్డ్ గా చూపించడం హిందువులు అలాగే బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బ తీశాయి.
దీనితో సోషల్ మీడియాలో ఇపుడు పెద్ద యుద్ధమే నడుస్తుంది. వెట్రిమారన్ ఇలాంటి సినిమా ఎలా తీస్తాడని ఓ రేంజ్ లో తనని ఆడిపోసుకుంటున్నారు. ఒక్క వెట్రి మారన్ నే కాకుండా హీరో విజయ్ సేతుపతిపై కూడా ఘోరంగా తిట్లు పడుతున్నాయి. ఒక బ్రాహ్మణ అమ్మాయిని ఈ రకంగా ప్రెజెంట్ చేసి చూపిస్తూ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అలాగే వీరితో పాటుగా దర్శకుడు పా రంజిత్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. వెట్రిమారన్, పా రంజిత్ లాంటి వారికి వర్ణ వివక్ష చూపిస్తారని అందుకే ఈ బ్యాడ్ గర్ల్ సినిమా విషయంలో ప్రచారం చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. అలాగే విజయ్ సేతుపతి చేసిన పోస్ట్ పై కూడా పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ఇలాంటి సినిమాలు కొత్త తరం యువతకి అవసరం అన్నట్టుగా చేసిన పోస్ట్ విజయ్ సేతుపతిపై ఉన్న గౌరవాన్ని తీసేసింది అని మీ ఇంట్లో ఉన్న ఆడ పిల్లలతో కూడా ఇలాంటి సినిమాలు లేదా అలాంటి పాత్రల్లో చూపిస్తారా అంటూ ఇప్పుడు తమిళ యువ సోషల్ మీడియా అంతా రచ్చ లేచిపోతుంది. ఇక వెట్రిమారన్ విషయంలో తాను ఏమనుకొని ఈ సినిమాని నిర్మాణం వహించారో కానీ ఈ సినిమా రిలీజ్ మాత్రం ఆపాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.
ఇక దీనితో పాటుగా వెట్రిమారన్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దర్శకునితో మాకు సినిమా వద్దని తారక్ కూడా సినిమా చెయ్యడానికి లేదు అని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో బ్యాడ్ గర్ల్ గా శృంగారానికి బానిస అయ్యిన అమ్మాయి పాత్రలో అంజలి శివరామన్ నటించగా వర్ష భరత్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ వివాదాస్పద చిత్రం రిలీజ్ వరకు వస్తుందో లేదో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











