నా పేరు శివ డైరెక్షన్ కి ఇంప్రెస్ అయిన జూ ఎన్టీఆర్...!?
జూ ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాతో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో 'ఊసరవెల్లి", బోయపాటి శ్రీను డైరెక్షన్ లో 'దమ్ము" చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ చిత్రాల తర్వాత జనవరిలో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఓ సినిమా, ఏప్రిల్ నుంచి శ్రీను వైట్లతో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ఈ రెండు చిత్రాలకు గణేష్ బాబు నిర్మాత. కాగా ఇటీవల రిలీజ్ అయిన 'నాపేరు శివ" దర్శకుడు సుసీంద్రన్ తో కూడా జూ ఎన్టీఆర్ ఓ సినిమా చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
'నాపేరు శివ" దర్శకుడు సుశీంద్రన్ తో కూడా జూ ఎన్టీఆర్ ఓ సినిమా చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 'నా పేరు శివ" చిత్రాన్ని చూసిన ఎన్టీఆర్ చాలా ఇంప్రెస్ అయ్యాడట. సుసీంద్రన్ కి ఫోన్ చేసి అభినందించాడట. సుశీంద్రన్ టేకింగ్, సబ్జెక్ట్ పై అతనికి వున్న కమాండ్ ని గుర్తించిన జూ ఎన్టీఆర్ తన ఇమేజ్ కి సరిపోయే కథతో వస్తే సుశీంద్రన్ తో సినిమా చేస్తానని చెప్పాడట. ప్రస్తుతం. సుశీంద్రన్ అలాంటి సబ్జెక్ట్ చెయ్యడానికి రెడీ చేసే పనిలో వున్నాడట..అయితే జూ ఎన్టీఆర్ చేతినిండా సినిమాలు వుండడం వల్ల ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు. అన్నీ కుదిరితే 2012 ఎండింగ్ లో జూ ఎన్టీఆర్, సుశీంద్రన్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











